Ori Devuda Vs Ginna : మంచు విష్ణు జిన్నా, విశ్వక్ సేన్ ఓరి దేవుడా, శివ కార్తికేయన్ ప్రిన్స్, కార్తీ సర్దార్ సినిమాలు ఈ శుక్రవారం అంటే నేడు విడుదలయ్యాయి. ఇందులో జిన్నా మాస్ ఆడియెన్స్‌ను టార్గెట్ చేయగా.. విశ్వక్ సేన్ ఓరి దేవుడా క్లాస్ ప్రేక్షకులను టచ్ చేసేందుకు వచ్చాడు. ఇక శివ కార్తికేయన్ ప్రిన్స్.. అనుదీప్ మ్యాజిక్, జాతిరత్నాలు ఫార్మూలాతో ముందుకు వచ్చింది. కార్తీ సర్దార్‌కు సపరేట్ సెక్షన్ ఆఫ్ ఆడియెన్స్ ఉంటారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఈ నాలుగు చిత్రాల్లో సర్దార్ సినిమాకు కాస్త ఎక్కువ పాజిటివ్ టాక్ వచ్చింది. ప్రిన్స్ అయితే.. జాతిరత్నాలు మ్యాజిక్‌ను రీ క్రియేట్ చేయలేకపోయింది. విశ్వక్ సేన్ ఓరి దేవుడా మంచి ప్రయత్నంగా పేరు తెచ్చుకుంది. మంచి టాక్ వచ్చింది. ఇక మంచు విష్ణు జిన్నా సినిమాకు రొటీన్ రొడ్డ కొట్టుడు చిత్రమనే టాక్ వచ్చింది. కానీ జిన్నాలో కామెడీ బాగా వర్కౌట్ అయింది. అది బీ, సీ సెంటర్లలో బాగానే సెట్ అవుతుంది. పైగా పాయల్, సన్నీ లియోన్ అందాలు మరింతగా ప్లస్ అయ్యేట్టు కనిపిస్తోంది.


ఈ నాలుగు చిత్రాల బిజినెస్, బ్రేక్ ఈవెన్ టార్గెట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అన్నింట్లోకెల్లా మంచు విష్ణు జిన్నా చిత్రం తక్కువ థియేటర్లో విడుదలవ్వడం, అతి తక్కువ బిజినెస్ జరిగిందని టాక్ వినిపిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రిన్స్ సినిమా 290 థియేటర్లో విడుదలైంది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ 7 కోట్లు. అదే సర్దార్ సినిమా అయితే.. 465 థియేటర్లలో రిలీజ్ అయింది. దాని బ్రేక్ ఈవెన్ టార్గెట్ 5.50 కోట్లు. ఇక విశ్వక్ సేన్ ఓరి దేవుడా సినిమా 415 థియేటర్లలో రిలీజ్ కాగా.. ఆరు కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ పెట్టుకుంది. 


మరి మంచు విష్ణు సినిమా అయితే అత్యల్పంగా 275 థియేటర్లలో రిలీజ్ అయింది. బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా ఐదు కోట్లు పెట్టుకుంది. విశ్వక్ సేన్ ఓరి దేవుడా సినిమానే ఎక్కువ థియేటర్లో విడుదలైంది. దానికే ఎక్కువ బిజినెస్ జరిగింది. మరి వీటిలో ఏది బ్రేక్ఈవెన్ అవుతుంది.. ఏది క్లీన్ హిట్ అవుతుందో చూడాలి.


Also Read : Ginna Movie Review : జిన్నా మూవీ రివ్యూ.. ట్రోలర్‌లకు మంచు విష్ణు కౌంటర్


Also Read : Sardar Movie Telugu Review: 'సర్దార్'గా రచ్చ రేపిన కార్తీ.. సినిమా ఎలా ఉందంటే?


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook