Vishwaksen Says Boys are More Loyal than Girls: నందమూరి బాలకృష్ణ హోస్టుగా ఆన్ స్టాప్ ఫుల్ విత్ ఎన్బీకె ప్రోగ్రాం విజయవంతంగా నడుస్తున్న సంగతి తెలిసిందే. ఆహా వీడియోలో ప్రసారమవుతున్న ఈ కార్యక్రమానికి సంబంధించిన మొదటి ఎపిసోడ్ సూపర్ హిట్ కావడంతో రెండవ సీజన్ కూడా ఇటీవల ప్రారంభించారు. మొదటి ఎపిసోడ్ కి చంద్రబాబు, లోకేష్ హాజరు కాగా రెండో ఎపిసోడ్ కు సిద్దు జొన్నలగడ్డ, యంగ్ హీరో విశ్వక్సేన్ హాజరయ్యారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక ఈ సందర్భంగా విశ్వక్సేన్ అమ్మాయిల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నందమూరి బాలకృష్ణ అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం గా విశ్వక్సేన్ మాట్లాడుతూ తనకు అమ్మాయిలు కంటే అబ్బాయిలతోనే కంఫర్ట్ కనిపిస్తుందని, అబ్బాయిలు లాయల్ గా ఉంటారు కానీ అమ్మాయిలు ప్లేటులు మార్చేస్తూ ఉంటారని అన్నారు. తనకు అబ్బాయిలు లాయల్ అనిపిస్తారని అందుకే వారు ఉన్నంత నమ్మకంగా అమ్మాయిలు ఉండరని చెప్పుకొచ్చాడు.


అయితే వెంటనే బాలకృష్ణ మీకేమైనా బ్రేకప్స్ అయి ఉంటాయి అంటే అయ్యాయని బాలకృష్ణతో విశ్వక్సేన్ చెప్పుకొచ్చారు. ఇక ఇదే సందర్భంగా విశ్వక్సేన్ మాట్లాడుతూ తనకు నందమూరి బాలకృష్ణ గారితో కూర్చుని మ్యాన్షన్ హౌస్ తాగుతూ మాట్లాడటం అనేది ఒక డ్రీమ్ అని తన ఫ్రెండ్స్ తో కూడా ఈ విషయాన్ని పలు సందర్భాల్లో చెప్పానని చెప్పుకొచ్చారు. ఇక నందమూరి బాలకృష్ణ  మ్యాన్షన్ హౌస్ బ్రాండ్ మాత్రమే తాగుతారని ఆయన స్వయంగా ఎన్నోసార్లు ఒప్పుకున్నారు.


ఇప్పుడు అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె షో స్పాన్సర్స్ లో ఒకటిగా  మ్యాన్షన్ హౌస్ కూడా వ్యవహరిస్తూ ఉండడం ఆసక్తికరంగా మారింది. ఇక విశ్వక్సేన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఇంటర్వ్యూలో విశ్వక్సేన్ అనేక విషయాలను కూడా పంచుకున్నాడు. ఆ మధ్య ఒక న్యూస్ ఛానల్ కార్యాలయంలో యాంకర్ దేవి నాగవల్లి విషయంలో జరిగిన వ్యవహారాన్ని కూడా గుర్తు చేసుకుని తనకు ఆ విషయంలో అవమానం జరిగిందని మామూలుగా అయితే అవమానం జరిగితే అక్కడికక్కడ ఇచ్చేసి వెనక్కి వస్తాను కానీ ఆ పరిస్థితుల్లో తాను ఏమీ చేయకుండా రావడమే మంచిది అని అనిపించిందని అందుకే వెనక్కి వచ్చేసాను అని చెప్పుకొచ్చారు. ఇక బాలకృష్ణ కూడా కొన్నిసార్లు ఏమీ చేయకుండా ఉండడమే మంచి పని అంటూ చెప్పుకొచ్చారు.


Also Read: Veerasimha Reddy: ''వీర సింహారెడ్డి''గా బాలయ్య.. పూనకాలు తెప్పించేలా 107 టైటిల్ అనౌన్స్మెంట్!


Also Read: Balakrishna: హెయిర్ స్టైల్ మీద కామెంట్స్.. హీరో సిద్దు జొన్నలగడ్డను చంపుతానన్న బాలకృష్ణ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook