Vishwambhara -Chiranjeevi: చిరంజీవి `విశ్వంభర` షూటింగ్ పై బిగ్ అప్‌డేట్.. రిలీజ్ డేట్ ప్రకటన..
Chiranjeevi - Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి 68 యేళ్ల వయసులో కూడా కుర్ర హీరోలతో సమానంగా పని చేస్తున్నాడు. వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం బింబిసార ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో `విశ్వంభర` మూవీ చేస్తున్నారు చిరు. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ పాటు సినిమాపై బిగ్ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్.
Vishwambhara - Chiranjeevi: చిరంజీవి కీర్తి కిరీటంలో పద్మవిభూషణ్ అనే అవార్డు వచ్చి చేరింది. తాజాగా కేంద్రం చిరును దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారంతో గౌరవించింది. త్వరలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులు మీదుగా మెగాస్టార్ ఈ అవార్డును అందుకోనున్నారు. ఆ సంగతి పక్కన పెడితే.. చిరంజీవి ప్రస్తుతం బింబిసార ఫేమ్ దర్శకుడు వశిష్ఠ డైరెక్షన్‌లో 'విశ్వంభర' మూవీ చేస్తున్నారు. ముందుగా ఈ సినిమాకు 'ముల్లోక వీరుడు' అనే టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. కానీ ఫైనల్‌గా ఈ మూవీకి 'విశ్వంభర' టైటిల్ ఫిక్స్ చేసారు.తాజాగా ఈ మూవీ మేకర్స్ బిగ్ అప్‌డేట్ ఇచ్చారు.
ఇప్పటికే ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు టైటిల్ రివీల్ చేసినపుడు వచ్చే యేడాది సంక్రాంతికి విడుదల అని అనౌన్స్ చేశారు. తాజాగా 2025 జనవరి 10న ఈ సినిమా రిలీజ్ చేయనున్నట్టు అఫీషియల్ డేట్ ప్రకటించారు. అంతేకాదు ఈ మూవీ షూటింగ్ ప్రోగ్రెస్‌లో ఉందని చెప్పారు. అంతేకాదు When MYTHS Collides Legends Rise అని చెబుతూ పోస్టర్ రిలీజ్ చేశారు. అంటే ఎపుడైతే అద్భుత శక్తులు కలుస్తాయో.. అపుడు ఒక లెజెండ్ అదే అద్భుతమైన వ్యక్తి పుట్టుకొస్తాడని అర్ధంలో కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసారు.
ఈ చిత్రంలో చిరంజీవి సరసన త్రిష సహా మరో ఇద్దరు భామలు నటిస్తున్నట్టు సమాచారం. మరోవైపు వరలక్ష్మి శరత్‌కుమార్ మరో ఇంపార్టెంట్ రోల్లో నటిస్తోందట. చిరు.. యముడికి మొగుడు, జగదేకవీరుడు అతిలోక సుందరి. అంజి సినిమాల తర్వాత నటిస్తోన్న సోషియో ఫాంటసీ చిత్రం 'విశ్వంభర'. ఈ మూవీలో చిరును ఢీ కొట్టే విలన్ పాత్రలో తమిళ హీరో శింబు నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే కథ విని ఇందులో చిరంజీవి పక్కన స్క్రీన్ షేర్ చేసుకోవాలనే కోరికతో ఈ మూవీలో యాక్ట్ చేయడానికి ఓకే చెప్పినట్టు సమాచారం.ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్ బ్యానర్ పై తెరకెక్కుతోంది.ఘరానా మొగుడు, ఆపద్భాందవుడు, ఎస్పీ పరశురామ్ సినిమాల తర్వాత చిరంజీవి చిత్రానికి కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు.
మరోవైపు విశ్వంభర మూవీ షూట్ కంప్లీట్ కాగానే చిరంజీవి... కూతురు సుస్మిత నిర్మాణంలో ఓ సినిమా చేస్తున్నాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీతో కలసి సుస్మిత ఈ సినిమాను నిర్మిస్తోంది. హరీష్ శంకర్ డైరెక్ట్ చేయనున్నారు. ప్రస్తుతం రవితేజతో 'మిస్టర్ బచ్చన్' మూవీ చేస్తున్నాడు. మరో రెండు నెలల్లో ఈ మూవీ కంప్లీట్ కానుంది. ఈ సినిమా హిందీలో అజయ్ దేవ్‌గణ్ హీరోగా నటించిన 'రెయిడ్' మూవీకి అఫీషియల్ రీమేక్. మరోవైపు పవన్ కళ్యాణ్‌తో చేస్తోన్న 'ఉస్తాద్ భగత్ సింగ్' ఎన్నికల తర్వాత ఈ యేడాది ద్వితీయార్ధంలో మళ్లీ ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. ఆ లోపు రవితేజ తర్వాత చిరంజీవి సినిమా కంప్లీట్ చేసి పవన్ సినిమాను కంప్లీట్ చేయనున్నారు. మొత్తంగా చిరంజీవి తన సినిమాల విషయంలో మంచి ప్లానింగ్‌తోనే ఉన్నట్టు తెలుస్తోంది.
ఇదీ చదవండి: Hair Oiling Tips: ఇలా నూనె రాసుకుంటే జుట్టు రాలడం ఖాయం! హెయిర్ ఆయిల్ పెట్టుకునే విధానం ఇలా ఉండాలి..
ఇదీ చదవండి: Side Effect of Paper Cup: మీరూ పేపర్ కప్పులో టీ తాగుతున్నారా? తస్మాత్ జాగ్రత్త..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook