Waltair Veerayya 7 Days Collections: మెగాస్టార్ చిరంజీవి మాస్ మహారాజా రవితేజ కాంబినేషన్ లో తెరకెక్కిన తాజా చిత్రం వాల్తేరు వీరయ్య. మాస్ సినిమాల దర్శకుడు బాబీ దర్శకత్వంలో ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మించింది. ఈ సినిమా విడుదలయి ఇప్పటికే వారం రోజులు పూర్తిగా అవడంతో ఈ వారం రోజులు పాటు కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అనే విషయం మీద ఒక లుక్ వేద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వాల్తేరు వీరయ్య రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఏడు రోజుల్లో గట్టిగా వసూలు చేసింది. 79 కోట్ల 86 లక్షల షేర్ 129 కోట్ల 10 లక్షల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. మొదటిరోజు 22 కోట్ల 90 లక్షలు, రెండవ రోజు 11 కోట్ల 95 లక్షలు, మూడోరోజు 12 కోట్ల 61 లక్షలు, నాలుగు రోజు 11 కోట్ల 42 లక్షలు, ఐదవ రోజు 8 కోట్ల 80 లక్షలు, ఆరవ రోజు ఏడు కోట్ల 33 లక్షలు, ఏడవ రోజు నాలుగు కోట్ల 85 లక్షలు వసూలు చేసింది.


ఇక ఏడవ రోజు ప్రాంతాలవారీగా చూస్తే నైజాం కోటి నలభై ఐదు లక్షలు, సీడేడ్ 40 లక్షలు, ఉత్తరాంధ్ర కోటి 15 లక్షలు, ఈస్ట్ గోదావరి 70 లక్షలు, వెస్ట్ గోదావరి 36 లక్షలు, గుంటూరు పాతిక లక్షల, కృష్ణ 36 లక్షలు నెల్లూరు 20 లక్షలు కలిపి మొత్తంగా నాలుగు కోట్ల 85 లక్షల షేర్ వసూళ్లు రాబట్టింది. ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏడు రోజుల్లో కర్ణాటక సహా మిగతా భారత దేశంలో ఆరు కోట్లు రాబడితే ఓవర్సీస్ లో 10 కోట్ల 60 లక్షలు రాబట్టింది.


ఈ నేపద్యంలో ప్రపంచవ్యాప్తంగా 96 కోట్ల 46 లక్షల షేర్ 165 కోట్ల 45 లక్షల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 88 కోట్ల బిజినెస్ జరుపుకోవడంతో 89 కోట్లకు బ్రేక్ ఈవెన్ టార్గెట్ గా నిర్ణయించారు. ఇక ఇప్పటికే బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తి చేసిన వాల్తేరు వీరయ్య సినిమా ఏడు కోట్ల 46 లక్షల లాభాలతో దూసుకుపోతోంది. మెగాస్టార్ చిరంజీవి సరసన శృతి హాసన్, రవితేజ సరసన కేథరిన్ తెరెసా నటించిన ఈ సినిమాని బాబీ డైరెక్ట్ చేశాడు.


ప్రకాష్ రాజ్ విలన్ పాత్రలో నటించగా రాజేంద్రప్రసాద్, సత్యరాజ్, బాబీ సింహ, ప్రదీప్ రావత్, షకలక శంకర్ వంటి వారు ఇతర కీలక పాత్రలలో కనిపించారు. ముందుగా మెగాస్టార్ ని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా కథ రాసుకున్నా  తర్వాత ఈ సినిమా కథలో అనేక మార్పులు చేర్పులు చేశానని దర్శకుడు బాబీ సినిమా ప్రమోషన్స్ లో చెప్పుకొచ్చారు. అందుకు తగినట్లుగానే సినిమా రిసల్ట్ కూడా ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తోంది. 


నోట్: ఈ సమాచారం వివిధ బాధ్యత మాల ద్వారా మేము సేకరించినదే కానీ దీనికి జీ తెలుగు న్యూస్ కి ఎలాంటి సంబంధం లేదు


Also Read: Waltair Veerayya Day 6: ఆరు రోజుల్లో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసిన వీరయ్య.. ఎన్ని కోట్ల లాభమంటే?


Also Read: Veera Simha Reddy 7 Days Collections: బ్రేక్ ఈవెన్ కు అతి చేరువలో వీర సింహా రెడ్డి.. ఇంకా ఎన్ని కోట్లు రాబట్టాలంటే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook