మెగాస్టార్ చిరంజీవి పూర్తి మాస్ పాత్రలో వస్తున్న వాల్తేరు వీరయ్య సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. సంక్రాంతికి విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ వేగం పెరిగింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మెగాస్టార్ చిరంజీవి, రవితేజల సినిమా వాల్తేరు వీరయ్య సంక్రాంతి పురస్కరించుకుని జనవరి 13న విడుదల కానుంది. విడుదలకు మరి కొద్దిరోజులే మిగలడంతో ప్రమోషన్స్ వేగం పుంజుకున్నాయి. వివిధ రకాల స్టిల్స్‌తో విడుదల చేస్తున్న పోస్టర్స్ సినిమాపై హీట్ పెంచేస్తున్నాయి. దేవి శ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాలోని రెండు పాటలు హిట్‌గా నిలిస్తే..ఇప్పుడు మూడవ సాంగ్ టైటిల్ సాంగ్ గా రాబోతుంది. రేపు అంటే డిసెంబర్ 26న వాల్తేరు వీరయ్య టైటిల్ సాంగ్ విడుదల కానుండటం సినిమాపై అంచనాలు మరింత పెరుగుతోంది.



టైటిల్ సాంగ్ రిలీజ్ ప్రకటన చేస్తూ మైత్రీ మూవీ మేకర్స్ విడుదల చేసిన పోస్టర్ అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్‌లో చిరంజీవి సిల్లౌట్ లుక్‌లో ఉన్నారు. గతంలో విడుదలైన పోస్టర్స్‌లో చిరంజీవి పూర్తిగా విలేజ్ లుక్‌లో ఉంటే..ఇందులో మాత్రం షర్ట్ అండ్ ప్యాంట్‌తో ఉన్నాడు. బాబీ తెరకెక్కిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమాలో చిరంజీవి పోలీసు అధికారిగా కన్పించనున్నాడు. 


Also read: Waltair Veerayya Review : వాల్తేరు వీరయ్యపై చిరంజీవి రివ్యూ.. సినిమా చూసి ఆ ఒక్క మాట చెప్పేశాడట!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook