Chiranjeevi is leading over Balakrishna in Ceeded: మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య అనే సినిమాతో సంక్రాంతి బరిలో దిగుతున్నారు. డైరెక్టర్ బాబీ డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్గా నటించింది. ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ అలాగే కొన్ని ప్రమోషనల్ వీడియోలు సినిమా మీద అమాంతం ఆసక్తిని పెంచేశాయి. ఇదే సమయానికి గోపీచంద్ మలినేని లేని డైరెక్షన్లో బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న వీరసింహారెడ్డి సినిమా కూడా విడుదలవుతుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సినిమాలో కూడా శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ రెండు సినిమాలను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించడం ఆసక్తికరంగా మారింది. అయితే ఈ రెండు సినిమాలు సంక్రాంతికి దిగడం దాదాపు కన్ఫర్మ్ అయిపోయింది. ఈ ఇద్దరు కలిసి ఇలా సంక్రాంతి బరిలో పోటీ పడటం ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా కొన్ని సందర్భాల్లో సంక్రాంతికి పోటీ పడ్డారు. ఈ నేపథ్యంలోనే వీరిద్దరి అభిమానులు తమ హీరోలు ఏమేరకు సత్తా చాటుతారా అనే విషయం మీద ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


అయితే హిట్లపరంగా ప్రస్తుతానికి బాలకృష్ణ చిరంజీవి కంటే ముందు ఉన్నా సరే ఈ సినిమాకి జరుగుతున్న బిజినెస్ పరంగా మాత్రం బాలకృష్ణ కంటే మెగాస్టార్ చిరంజీవి కాస్త ముందుగా ఉన్నారని అంటున్నారు. వాస్తవానికి బాలకృష్ణ చిరంజీవి ఇద్దరికీ సీడెడ్ ఏరియా బాగా కలెక్షన్లు తెచ్చిపెట్టే ఏరియా. బాలకృష్ణ చివరి సినిమా అఖండ 15 కోట్లకు పైగా షేర్ కేవలం సీడెడ్ ప్రాంతం నుంచి రాబట్టింది. చిరంజీవి గత సినిమాలకు కూడా ఈ ప్రాంతం నుంచి మంచి నెంబర్లు వచ్చాయి.


ఇక తాజాగా ఈ ప్రాంతానికి సంబంధించి వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి సినిమాల హక్కులు అమ్ముడు అయినట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాకి 16 కోట్ల రూపాయల వరకు హక్కులు అమ్ముడుపోగా బాలకృష్ణ సినిమాకి మాత్రం 12 కోట్ల రూపాయలు వరకే హక్కులు వచ్చినట్లు తెలుస్తోంది. ఒక రకంగా బాలకృష్ణకు రాయలసీమలో చాలా మంచి ఫాలోయింగ్ ఉందని చెబుతూ ఉంటారు. కానీ ఆయనకంటే చిరంజీవి సినిమా ఎక్కువ మార్కెట్ చేయడం చర్చనీయాంశం అయింది.


అయితే చిరంజీవి సినిమాలో మరో హీరో రవితేజ కూడా ఉండడంతో నిర్మాతలు కాస్తంత ఎక్కువగానే రేట్లు చెబుతున్నారు అనే వాదన వినిపిస్తోంది. చిరంజీవి సినిమా హక్కులు దక్కని వారు బాలకృష్ణ సినిమా హక్కులు బాలకృష్ణ సినిమా హక్కులు దక్కని వారి చిరంజీవి సినిమా హక్కులు ఇలా డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాల హక్కులు కొనేందుకు పోటీ పడుతున్నారని కచ్చితంగా రెండు సినిమాలు గట్టిగానే ఆడతాయని వారు నమ్మకంగా ఉన్నట్టుగా ప్రస్తుతానికి ప్రచారం అయితే జరుగుతుంది.


Also Read: Dil Raju vs Mythri : నాకే హ్యాండ్ ఇస్తారా? మైత్రీకి భారీ రివెంజ్ ప్లాన్ చేసిన దిల్ రాజు?


Also Read: Actor Lohithaswa: అఖండ నటుడి ఇంట తీవ్ర విషాదం.. ఏమైందంటే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook