Warangal Srinu Liger Movie: మరోసారి పప్పులో కాలేసిన వరంగల్ శ్రీను.. `లైగర్`తో మళ్లీ నష్టాలు!
Warangal Srinu One More Wrong Step With Liger Movie: నైజాం ఏరియాలో లైగర్ ను కొనుగోలు చేసిన వరంగల్ శ్రీను మరోసారి పప్పులో కాలేశాడు అని అంటున్నారు. ఆ వివరాలు
Warangal Srinu One More Wrong Step With Liger Movie: నైజాం ఏరియాలో చాలా యాక్టివ్ గా ఉన్న ఏకైక డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు మాత్రమే ఈ ఏరియాలో ఏషియన్ సునీల్, సురేష్ బాబు లాంటివాళ్ళు అడపాదడపా తమకు సంబంధించిన సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నా దిల్ రాజు మాత్రమే ఎక్కువగా ఇతర హీరోలకు సంబంధించిన సినిమాలను కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. ఒకరకంగా నైజాం ఏరియాలో ఏక చక్రాధిపత్యం ప్రదర్శిస్తున్న దిల్ రాజుకు షాక్ ఇస్తూ వరంగల్ శ్రీను అనే వ్యక్తి తెరమీదకు వచ్చాడు.
వరంగల్ కు చెందిన ఆడెపు శ్రీనివాస్ సినీ పరిశ్రమ మీద మక్కువతో డిస్టిబ్యూషన్ రంగాన్ని ఎంచుకున్నారు. కొన్నాళ్ల క్రితం ఆయన దిల్ రోజుతో పోటీపడి మరీ సినిమాలు దక్కించుకునే ప్రయత్నం చేశారు. క్రాక్ సినిమా విషయంలో ఇద్దరి మధ్య కాస్త వివాదం కూడా చెలరేగడంతో ఆ విషయం చర్చనీయాంశం అయింది. ఇక దిల్ రాజు మీద పంతంతో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య సినిమా హక్కులు 36 కోట్లు పెట్టి మరి దక్కించుకున్నారు శ్రీను. అయితే ఈ సినిమా బోల్తా కొట్టడంతో భారీగా నష్టాలు కూడా చవిచూడాల్సి వచ్చింది.
అయితే వరంగల్ శ్రీను మాత్రం ఈ నష్టాలతో వెన్ను తిరగకుండా వ్యాపారం అన్నాక ఇలాంటివి కామనే అనుకుని లైగర్ సినిమాను కూడా భారీ ధరకు కొనుగోలు చేశాడు. విజయ్ దేవరకొండ గత సినిమాలతో, ఆయన మార్కెట్ తో ఏ మాత్రం సంబంధం లేకుండా ఈ సినిమా నైజాం హక్కుల కోసం ఏకంగా 25 కోట్ల రూపాయలు వెచ్చించి మరీ దక్కించుకున్నాడు. నిజానికి లైగర్ సినిమాకు పూరి జగన్నాథ్ అండ్ టీం చేసిన ప్రమోషన్స్ తో సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
అందుకే ఈ సినిమా భారీ విజయం సాధిస్తుందని ప్రేక్షకులలో అంచనాలు ఏర్పడతుందో వరంగల్ శీను మరో ఆలోచన లేకుండా ఈ సినిమా హక్కులు దక్కించుకున్నాడు. అయితే ఆగస్టు 25వ తేదీన విడుదలైన లైగర్ సినిమాకి మొదటి ఆట నుంచి డివైడ్ టాక్ రావడంతో వరంగల్ శీను మరోసారి ఇబ్బందుల్లో పడినట్లే అనే టాక్ వినిపిస్తోంది. అయితే ఎంత నెగిటివ్ టాక్ వచ్చినా ప్రేక్షకులు గనుక సినిమాను మెచ్చితే బ్రహ్మరథం పడతారు అన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి లైగర్ విషయంలో ఏం జరుగుతుందో అనేది ఒకటి రెండు రోజుల్లో తేలబోతోంది.
Also Read: Heros Rejected Liger: ప్రభాస్, ఎన్టీఆర్ సహా లైగర్ ను రిజెక్ట్ చేసిన హీరోలు ఎవరంటే?
Also Read: Liger Trolls: “ఇండియాని షేక్ చేయాలె”.. అప్పుడు చెప్తే విన్నాడా ఈ పెద్ద మనిషి! ఆడుకుంటున్న నెటిజన్లు?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి