We Demand Prabhas Film Updates Trending: ప్రభాస్ ప్రస్తుతానికి వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే, వాస్తవానికి బాహుబలి సిరీస్ తర్వాత సాహో అనే సినిమాతో ప్రభాస్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా కలిసి రాకపోవడంతో బాగా గ్యాప్ తీసుకుని రాధేశ్యామ్ సినిమా చేశాడు. ఆ సినిమా ప్రేక్షకులందరినీ ఆకట్టుకుంటుంది అనుకున్నాడు కానీ ఆ సినిమా కూడా బోల్తా కొట్టింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ నేపథ్యంలోనే ఆయన ప్రస్తుతం చేస్తున్న సినిమాల మీద దృష్టి పెట్టి ఎక్కడా తేడా పడకుండా సినిమా కథల మీద అలాగే కంటెంట్ మీద ఫోకస్ పెట్టినట్లు చెబుతున్నారు. ప్రస్తుతానికి ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్టు కే సినిమా చేస్తున్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ అనే సినిమా చేస్తున్నాడు, అలాగే తానాజీ దర్శకుడు ఓమ్ రౌతు దర్శకత్వంలో ఆది పురుష్ అనే సినిమా చేస్తున్నాడు.


ఇవి కాకుండా ఇంకా ప్రకటించకుండానే ఆయన మారుతీ దర్శకత్వంలో ఒక చిన్న బడ్జెట్ సినిమా చేస్తున్నట్లుగా చాలా కాలం నుంచి ప్రచారం ఉంది. చిన్న సైజు హారర్ మూవీ ఒకటి తీస్తున్నారనే ప్రచారం నేపథ్యంలో ఈ సినిమా వద్దని కూడా ప్రభాస్ అభిమానులు ఆ మధ్య డిమాండ్ చేశారు. అయినా ప్రభాస్ వెనక్కి తగ్గకుండా సినిమాలు చేస్తూ వెళుతున్నారు.


అయితే తాజాగా ప్రభాస్ సినిమాల నుంచి ఏదో ఒక అప్డేట్ ఇవ్వాలి అంటూ ఆయన అభిమానులు పెద్ద ఎత్తున ట్విట్టర్లో ట్రెండ్ సృష్టించారు. ప్రభాస్ సినిమాల నుంచి ఏదో ఒక అప్డేట్ ఇవ్వండి, ఫలానా అని నేను డిమాండ్ చేయడం లేదు కానీ ఏ సినిమా ఎక్కడి వరకు వచ్చింది? ఎప్పుడు రిలీజ్ ఉంటుంది అనే విషయాలను మరోసారి ప్రకటించాలని వీలైతే ఏదైనా పోస్టర్ రిలీజ్ చేసినా తాము హ్యాపీగా ఉంటామని చెబుతూ పెద్ద ఎత్తున ట్రెండ్ అయితే సృష్టించారు మరి చూడాలి ప్రభాస్ తో సినిమాలు తెరకెక్కిస్తున్న మేకర్స్ ఏమైనా అప్డేట్స్ రిలీజ్ చేస్తారో లేదో.


Also Read: Remove Thaman From SSMB 28: తమన్ ను తీసేయమంటున్న మహేష్ ఫాన్స్.. మీరు పిల్లలురా అంటున్న తమన్!


Also Read: Assistant Director Arrested: సినిమా అవకాశాలంటూ ట్రాప్.. ఏకంగా 500 మంది అమ్మాయిలను వ్యభిచారంలోకి దించిన అసిస్టెంట్ డైరెక్టర్!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.