మూవీ రివ్యూ:  వీ ల‌వ్ బ్యాడ్ బాయ్స్  (We Love Bad Boys)
నటీనటులు: అజ‌య్ క‌తూర్వార్, వంశీ ఏక‌సిరీ, ఆదిత్య శశాంక్, ప్ర‌గ్యా న‌య‌న్, అలీ, పృథ్వీ రాజ్, తదితరులు..
క‌థ‌, మాట‌లు: ఆనంద్ కొడ‌వ‌టిగంటి
మ్యూజిక్: ర‌ఘు కుంచె
నిర్మాత: ప‌ప్పుల క‌న‌క దుర్గారావు
దర్శకత్వం: రాజు రాజేంద్ర ప్ర‌సాద్


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మంచి ఎమోషన్స్ పూర్తి రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్‌గా తెర‌కెక్క‌ని చిత్రం వీ లవ్ బ్యాడ్ బాయ్స్. ఈ మూవీ నేటి యూత్, ల‌వ్‌కు అద్దం పట్టేలా ఈ సినిమాను తెర‌కెక్కించారు. ఎమోష‌న‌ల్ కామెడీ ఎంట‌ర్టైన‌ర్ తెర‌కెక్కిన ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను ఏ విధంగా ఆక‌ట్టుకుందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..


కథ
ప్రశాంత్ (అజయ్ కతుర్వార్), వినయ్ (వంశీ యాకసిరి), అరుణ్ (ఆదిత్య శశాంక్) రూమ్‌మేట్స్ పైగా మంచి స్నేహితులు. ముగ్గురూ నిజమైన, స్వచ్చమైన ప్రేమ కోసం ఎదురుచూస్తుంటారు. దివ్య (రోమికా శర్మ), రమ్య (రోషిణి సహోతా) మరియు పూజ (ప్రజ్ఞా నయన్) అక్కాచెల్లెళ్లు. ఈ ముగ్గురూ ఆ ముగ్గురి ప్రేమలో పడతారు. అంటే దివ్య ప్రశాంత్‌తో, రమ్య వినయ్‌తో, పూజ అరుణ్‌లతో ప్రేమలో పడతారు.  ఈ సంద‌ర్భంగా జ‌రిగిన ప‌రిణామాల‌తో వీరి జీవితాల్లో ఎలాంటి మార్పులు చోటుచేసుక‌న్నాయ‌నేదే ఈ సినిమా మిగిలిన స్టోరీ.


క‌థ‌నం, విశ్లేష‌ణ‌..


నేటి యవత ఆలోచ‌న‌ల‌కు అద్దం ప‌ట్టేలా ఈ సినిమాను దర్శకుడు పూర్తి వినోద భరితంగా తెరకెక్కించాడు. లవ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్‌గా వచ్చిన ఈ మూవీ అట్రాక్ట్ చేస్తోంది. నేటి యువతకు మంచి సందేశాన్ని ఇచ్చే విధంగా ఉంది. ఫ‌స్ట్ హాస్ హ్యూమ‌ర‌స్‌గా సాగిపోతుంది. సెకండాఫ్  ఎమోషనల్‌గా ఉండ‌టం ప్రేక్ష‌కుల‌ను క‌దిలిస్తోంది.  క్లైమాక్స్‌‌లో ఇటు యూత్‌కి అటు పేరెంట్స్‌కి ఇచ్చిన సందేశం అందరినీ కదిలిస్తుంది.


ముఖ్యంగా ఈ సినిమాలో పోలీస్ స్టేష‌న్ సీన్స్.. ప్రాస్టిట్యూడ్స్ సీన్స్, అలీ ఎపిసోడ్ ప్రేక్ష‌కుల‌ను క‌డుపుబ్బా న‌వ్విస్తాయి. ద‌ర్శ‌కుడు ఆయా సీన్స్‌ను ఎంతో గ్రిస్పింగ్‌గా తెర‌కెక్కించారు. సినిమా నిడివి కాస్త త‌గ్గించి ఉంటే బాగుండేది. రొమాంటిక్ ఎంట‌ర్టేన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాలో సంగీతం పెద్ద ఎస్సెట్‌గా నిలిచింది. విజువ‌ల్స్, సీన్స్ బాగున్నాయి.



నటీనటుల విష‌యానికొస్తే..


ఈ సినిమాలో న‌టించింది కొత్త‌వాళ్లైనా ఎంతో ఈజ్‌తో న‌టించారు. వారి పాత్ర‌ల‌కు ప‌ర్ఫెక్ట్‌గా సూట‌య్యారు. నేటి యువ‌త‌కు త‌గ్గ‌ట్టుగా న‌టించారు. రోమికా శ‌ర్మ త‌న గ్లామ‌ర్‌తో ఆక‌ట్టుకుంటుంది. రోషిణి స‌హోత‌, ప్ర‌గ్యా న‌య‌న్ స్క్రీన్ పై అందంగా క‌నిపించారు. ఇక పోసాని కృష్ణ‌ముర‌ళీ, పృథ్వీ రాజ్ త‌మ పాత్ర‌ల్లో న‌వ్వించారు.


ప్లస్ పాయింట్స్


కామెడీ సీన్స్


హీరోయిన్స్ గ్లామ‌ర్


నిర్మాణ విలువలు


మైన‌స్ పాయింట్స్


సెకండాఫ్


అక్క‌డక్క‌డ బోర్ కొట్టించే సీన్స్



చివ‌రి మాట‌.. వి ల‌వ్ బ్యాడ్ బాయ్స్.. రోల‌ర్ కోస్ట్ రైడ్..


రేటింగ్ : 2.75/5