Netizens trolls on Nagarjuna Look at Jayamma Panchayathi pre release event: 'యువ సామ్రాట్' నాగార్జున గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. 36 ఏళ్లకు పైగా సినిమా ఇండస్ట్రీలో ఉంటూ టాలీవుడ్‌లో అగ్ర హీరోగా కొనసాగుతున్నారు. ఇక 62 ఏళ్ల వయస్సులోనూ టాలీవుడ్ కింగ్ నాగార్జున కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. నాగ్ ఫిట్‌నెస్‌, ఫిజిక్, పేస్ ఛార్మింగ్ విషయంలో ఈనాడు తగ్గరు. నిత్యం నవ మన్మదుడిలా ఉంటారు. అందుకే ఆయనను యువ హీరోలు ఆదర్శంగా తీసుకుంటారు. అయితే ఎప్పుడూ చాలా ఫ్రెష్‌గా ఉండే నాగ్ ఫేస్ తాజాగా కళతప్పింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రముఖ యాంకర్‌ సుమ కనకాల కీలక పాత్రలో దినేష్‌ కుమార్, షాలినీ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'జయమ్మ పంచాయితీ'. విజయ్‌ కుమార్‌ కలివరపు దర్శకత్వం వహించిన ఈ సినిమాను బలగ ప్రకాశ్‌ నిర్మించారు. జయమ్మ పంచాయితీ చిత్రం మే 6న రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ జరగ్గా.. కింగ్ నాగార్జున, న్యాచురల్ స్టార్ నాని ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగ్ కొద్దిసేపే మాట్లాడేది తన ప్రసంగంను ముగించారు. 


జయమ్మ పంచాయితీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా వచ్చిన నాగార్జునను చుసిన అక్కడి వారందరు షాక్ అయ్యారు. నాగ్ పేస్  పీక్కుపోయి, వయస్సు మీదపడినట్లు కనిపించారు. గతంలో నాగ్ ముఖంలో ఉండే చార్మింగ్ ఇప్పుడు లేదు. టాలీవుడ్ కింగ్ కాస్త డల్‌గా ఉన్నట్లు అనిపించారు. నాగార్జునకు సంబందించిన ఫొటోస్, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఫొటోస్ చూసిన నెటిజన్లు అరరే.. నాగార్జునకు ఏమైంది?, కింగ్ అలా మారిపోయాడేంటి? అంటూ కామెంట్లు చేస్తున్నారు. 


నాగార్జున అలా ఉండడానికి రెండు కారణాలు ఉన్నాయని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం 'ఘోస్ట్' సినిమా షూటింట్‌లో పాల్గొంటున్న నాగ్.. ఎండలకు అలసిపోవడంతోనే అలా ఉన్నారని కొందరు అంటున్నారు. నాగ్ గత కొన్నిరోజుల నుంచి కొడుకుల (నాగ చైతన్య, అఖిల్) భవిష్యత్ గురించి ఎక్కువగా ఆలోచిండడం వల్లనే ఇలా మారిపోయారని మరికొందరు చెవులు కొరుక్కుంటున్నారు. ఇందులో నిజమెంత ఉందో తెలియదు కానీ.. నాగార్జున ముఖంలో మాత్రం మునుపటి చార్మింగ్ లేదు. 


Also Read: Weather Report: మండే ఎండల్లో.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు చల్లని కబురు!


Also Read: Covid 19 Cases: రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు.. భారత్‌లో కొత్తగా ఎన్ని నమోదయ్యాయంటే!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook