Raj Tarun: లావణ్యతో శేఖర్ బాషాకు ఉన్న లింకేంటి.. ? రాజ్ తరుణ్ ఎందుకు సైడ్ అయ్యాడు..
Raj Tarun Vs Lavanya: తెలుగు సినీ ఇండస్ట్రీలో రాజ్ తరుణ్, లావణ్య ఘటనలో సినిమాకు మించిన ట్విస్టులున్నాయి. రాజ్ తరుణ్ తనను మోసం చేశాడంటూ మీడియాకు ఎక్కింది లావణ్య. ఈ నేపథ్యంలో లావణ్య.. రాజ్ తరుణ్ మాదిరే ఎంతో మందిని మోసం చేసిందంటూ శేఖర్ బాషా జీ తెలుగు మీడియాకు ఎక్స్ క్లూజివ్ గా కొన్ని సాక్ష్యాలు అందించారు.
Raj Tarun Vs Lavanya: గత కొన్నేళ్లుగా రాజ్ తరుణ్ లవ్ మ్యాటర్ సినీ ఇండస్డ్రీలో హాట్ టాపిక్ గా మారింది. రాజ్ తరుణ్ తనను మోసం చేశాడంటూ లావణ్య కొద్ది రోజుల క్రితం మీడియాకు ఎక్కింది. అంతేకాదు రాజ్ తరుణ్.. ప్రస్తుతం తను సినిమా చేస్తోన్న మాల్వీ మల్హోత్రతో సన్నిహితంగా ఉంటూ తనను దూరం పెట్టారంటూ పెద్ద రచ్చే చేసింది. తనతో దాదాపు 11 యేళ్లు లివింగ్ రిలేషన్ షిప్ లో ఉన్న రాజ్ తరుణ్.. మాల్వీ మల్హోత్రతో పరిచయం తర్వాత.. తనను దూరం పెట్టినట్టు పెద్ద రచ్చ చేసింది. అంతేకాదు రాజ్ తరుణ్ ను గుడిలో పెళ్లి చేసుకున్నట్టు చెప్పింది.
తాజాగా ఈ మ్యాటర్ పై శేఖర్ బాషా అనే వ్యక్తి జీ తెలుగు మీడియాతో మాట్లాడూతూ.. లావణ్యకు కేవలం రాజ్ తరుణ్ మాత్రమే.. సుశాంత్ సహా మరికొంత మందితో ఎఫైర్స్ ఉన్నట్టు జీ మీడియాకు ఫ్యాక్ట్ చెక్ పేరుతో కొన్ని సంచలన నిజాలు బయటపెట్టాడు. ఆమె ఇతరులతో గడిపిన ఫోటోలను బయట పెట్టాడు. కేవలం రాజ్ తరుణ్, సుశాంత్, మస్తాన్ సహా ఎంతో మందితో ఆమె సన్నిహితంగా ఉన్న కొన్ని ఫోటోలను బయటపెట్టాడు.
ఈ సందర్భంగా శేఖర్ బాషా.. లావణ్య గురించి కొన్ని విషయాలను బయటపెట్టాడు. రాజమండ్రిలో లావణ్యపై ఒక బ్లాక్ మెయిలింగ్ కేసుతో పాటు తెలుగులో నార్సింగి పీస్ ఎలో డ్రగ్స్ పెల్లర్ గా రెడ్ హ్యాండెడ్ గా ఆమె పట్టుబడినట్టు చెప్పుకొచ్చాడు. అంతేకాదు ఆమె ఎంతో మందిని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు సంపాదించిన విషయాన్ని ప్రస్తావించారు. ఈ సందర్భంగా మస్తాన్ సాయి అనే వ్యక్తికి లావణ్యకు మధ్య సంబంధం ఏమిటో అని జీ మీడియా యాంకర్ అడిగిన ప్రశ్నకు లావణ్య సమాధానం దాటవేసింది. మొత్తంగా లావణ్య .. డబ్బు కోసమే రాజ్ తరుణ్ ను ఆమె ఇబ్బందుల పాలు చేసినట్టు శేఖర్ బాషా తన దగ్గర ఉన్న ఆధారాలను బయటపెట్టాడు. అయితే .. లావణ్యకు సంబంధించిన ఫోటో కాల్ డాటా అతని దగ్గర ఎలా వచ్చిందనేదే ఇపుడు హాట్ టాపిక్ గా మారింది.
ఇదీ చదవండి: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..
ఇదీ చదవండి: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter