Mahashivratri Puja 2023: ఈసారి మహాశివరాత్రి ఎన్నో తారీఖు జరుపుకోవాలో తెలుసా?
Mahashivratri Puja 2023 Date: మరికొద్ది రోజుల్లో మహాశివరాత్రి పర్వదినం రాబోతోంది, ఈ క్రమంలో అసలు ఆ పర్వదినం ఎప్పుడు రాబోతుంది? ఎప్పుడు జరగబోతోంది? అనే వివరాల్లోకి వెళితే
When is Mahashivratri Puja 2023: సంక్రాంతి పండగ తర్వాత వచ్చే పండగలలో ముఖ్యమైన పండుగ మహాశివరాత్రి. మన హిందువులు అన్ని పండుగలు పగటి పూట జరుపుకుంటే ఈ పండుగ మాత్రం రాత్రిపూట జరుపుకుంటారు, మహాశివరాత్రి రోజున అర్ధరాత్రి 12 గంటలకు జ్యోతి స్వరూపుడైన శివుడు లింగ రూపంలో దర్శణమిస్తాడని నమ్ముతారు. ఇక శివరాత్రి రోజు పగలంతా ఉపవాసం ఉండి, మనస్సులోనే దైవ చింతనతో మునిగిపోతారు.
ఇక ఆరోజు రాత్రి సమయంలో శివుని అనుగ్రహం కోసం నిద్ర పోకుండా జాగరణ అంటే మేలుకొని భక్తిశ్రద్ధలతో అభిషేకాలు, పూజలు, భజనలు చేస్తారు. అందుకే ఆ పండుగను శివరాత్రి అని పిలుస్తారు. ఇక ఈ ఏడాది మహాశివరాత్రి ఫిబ్రవరి 18న జరుపుకోనున్నారు. ఇక హిందూ క్యాలెండర్ ప్రకారం, మహాశివరాత్రిని ఫాల్గుణ మాసంలోని కృష్ణ పక్ష చతుర్దశి రోజున జరుపుకుంటారు.
ఇక పురాణాల ప్రకారం శివలింగం మహాశివరాత్రి నాడే ఉద్భవించిందట, ఆ రోజున విష్ణువు, బ్రహ్మ ముందుగా శివలింగాన్ని పూజించారని నమ్మిక. అంతేకాదు హిందూ విశ్వాసాల ప్రకారం, ఆ రోజునే శివుడికి పార్వతికి వివాహం జరిగిందట. ఈ సారి మహా శివరాత్రి నాడు ముహూర్తాలను పరిశీలిద్దాం. ఫిబ్రవరి 18, శనివారం త్రయోదశి తిథి కాగా ఈ తిథిలో ప్రదోష వ్రతాన్ని కూడా పాటిస్తారు.
ఇక శివుని ఆరాధనకు ప్రదోష వ్రతం ప్రత్యేకమని చెబుతున్నారు. ఇక త్రయోదశి తిథి ముగిసిన వెంటనే చతుర్దశి తిథి ప్రారంభమవుతుంది. ఇక ఇది శనివారం రాత్రి 08.05 గంటలకు మహా శివరాత్రి ప్రారంభమవుతుంది, అది 19 ఫిబ్రవరి 2023 సాయంత్రం 04.21 నిమిషాలకు ముగుస్తుంది.
మహాశివరాత్రి ఫిబ్రవరి 18 -19లో ఎప్పుడు జరుపుకోవాలి?
ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలో కృష్ణ పక్ష చతుర్దశి తిథి నాడు మహాశివరాత్రిని జరుపుకుంటారు. మహా శివరాత్రి నాడు నాలుగు గంటల్లో మహాదేవుని ఆరాధించడం విశేష ప్రాముఖ్యత ఉందని, రాత్రి 8 వ ముహూర్తానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని అంటున్నారు. ఈ సారి చతుర్దశి తిథి ఫిబ్రవరి 19 సాయంత్రం ముగుస్తుంది కాబట్టి ఫిబ్రవరి 18న మహాశివరాత్రి పండుగను జరుపుకోనున్నారు.
శుభ సమయం :18 ఫిబ్రవరి 2023
అభిజిత్ ముహూర్తం: మధ్యాహ్నం 12:29 నుంచి 01:16 వరకు
అమృతకాలం: మధ్యాహ్నం 12:02 నుండి 01:27 వరకు
సంధ్య ముహూర్తం:సాయంత్రం 06:37 నుండి 07 వరకు:02 వరకు
Also Read: Venus Transit 2023: శుక్రుడి మీనరాశి గోచారం, ఈ 4 రాశులకు రానున్న 25 రోజులు తీవ్ర అప్రమత్తత అవసరం, లేకపోతే...
Also Read: Vijaya Ekadashi 2023: విజయ ఏకాదశి ఎఫెక్ట్.. ఇక ఈ 5 రాశులకు ఇవాళ తిరుగే ఉండదు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook