Bigg Boss OTT Telugu: బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ (bigg Boss) కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. హాలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన ఈ కాన్సెప్ట్‌ను.. మొదటిగా హిందీలో.. ఆ తర్వాత దక్షినాది భాషలలో ప్రారంభించారు. తెలుగులో ఇప్పటిదాకా బిగ్ బాస్ ఐదు సీజన్లు పూర్తి చేసుకుంది. ఇటీవల ముగిసిన తెలుగు బిగ్ బాస్ విజేతగా వీజే సన్నీ (VJ Sunny) నిలిచాడు. అయితే ఈ సీజన్ ముగిసిన రెండు నెలల వ్యవధిలోనే మరోసారి ఫ్యాన్స్ ను అలరించేందుకు సిద్ధమైంది ఈ షో. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఈసారి ఓటీటీ ప్రేక్షకులకు మాత్రమే బిగ్ బాస్ షో (Bigg Boss OTT first season) అందుబాటులోకి రానుంది. దీనికి కూడా నాగార్జునే (Nagarjuna) హోస్ట్ గా వ్యవహారించనున్నారు. హౌస్‌లో జరిగే విషయాలను ఓటీటీలో 24 గంటల పాటు చూపించనుంది బిగ్ బాస్ యూనిట్. అయితే ఫిబ్రవరి 20వ తేదీన ఈ తెలుగు బిగ్ బాస్ ఓటీటీ షో (Bigg Boss OTT Telugu) లాంచ్ కానుందని జోరుగా ప్రచారం సాగుతోంది. ఇది ఎంతవరకు నిజమన్నది షో నిర్వాహకుల నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 


Also read: RGV Fires on AP Govt: ఏపీలో సినిమా టికెట్ ధరల తగ్గింపుపై ఆర్జీవీ ఫైర్.. మంత్రి పేర్ని నానిపై ప్రశ్నల వర్షం


ఓటీటీ తొలి సీజన్ కంటెస్టెంట్లు అంటూ కొందరి పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో ప్రముఖంగా యాంకర్‌ వర్షిణి (Anchor Varishini), యాంకర్‌ శివ, డ్యాన్స్‌ షో ‘ఢీ-10’ విజేత రాజు, టిక్‌టాక్‌ స్టార్‌ దుర్గారావు, ‘సాఫ్ట్‌వేర్‌ డెవలపర్స్‌’వెబ్‌ సిరీస్‌ ఫేమ్‌ వైష్ణవి, సోషల్‌ మీడియా స్టార్‌ వరంగల్‌ వందన, యాకర్‌ ప్రత్యూష పేర్లు ఓటీటీ బిగ్ బాస్ కంటెస్టెంట్లుగా వినిపిస్తున్నాయి.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి