Shubhman Gill-Sara Ali Khan: సారా వదిన ఎక్కడ అంటూ.. శుభ్‌మన్ గిల్‌ను టీజ్ చేసిన ఫాన్స్! ఎంకరేజ్ చేసిన కోహ్లీ
![Shubhman Gill-Sara Ali Khan: సారా వదిన ఎక్కడ అంటూ.. శుభ్‌మన్ గిల్‌ను టీజ్ చేసిన ఫాన్స్! ఎంకరేజ్ చేసిన కోహ్లీ Shubhman Gill-Sara Ali Khan: సారా వదిన ఎక్కడ అంటూ.. శుభ్‌మన్ గిల్‌ను టీజ్ చేసిన ఫాన్స్! ఎంకరేజ్ చేసిన కోహ్లీ](https://telugu.cdn.zeenews.com/telugu/sites/default/files/styles/zm_500x286/public/2023/02/02/261274-shubhman-gill-sara-ali-khan.jpg?itok=PMyBf6cX)
Indian Fans shouting Sara Ali Khan name infront of Shubman Gill. శుభ్‌మాన్ గిల్ ఫీల్డింగ్ చేస్తుండగా స్టేడియంలోని ఫాన్స్ `హమారీ భాభీ కైసీ హో` అంటూ గట్టిగా అరిచారు.
Where is Sara Ali Khan, Indian Fans teased Shubman Gill: టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మాన్ గిల్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. న్యూజిలాండ్ పర్యటనలో గిల్.. ఓ డబుల్ సెంచరీ, రెండు సెంచరీలు చేశాడు. గిల్ డబుల్ సెంచరీ, సెంచరీ బాదిన విషయం తెలిసిందే. కివీస్‌తో జరిగిన మొదటి వన్డేలో డబుల్ సెంచరీ (208; 145 బంతుల్లో 19 ఫోర్లు, 9 సిక్సర్లు) బాదిన గిల్.. మూడో వన్డేలో సెంచరీ (112; 78 బంతుల్లో 13 ఫోర్లు, 5 సిక్స్‌లు) బాదాడు. ఇక న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో 63 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్స్‌ల సాయంతో 126 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. దాంతో మూడు ఫార్మాట్లలోనూ సెంచరీ చేసిన ఐదో భారత ప్లేయర్‌గా ఘనత సాధించాడు.
అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోదీ స్టేడియంలో బుధవారం భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచులో శుభ్‌మాన్ గిల్ సెంచరీ చేసి టీమిండియాకు భారీ విజయాన్ని అందించాడు. ప్రస్తుతం గిల్ పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. ఈ నేపథ్యంలో గిల్‌కు సంబందించిన ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆ వీడియో కివీస్‌తో జరిగిన వన్డే సిరీస్ సందర్భంగా చోటుచేసుకుంది.
శుభ్‌మాన్ గిల్ బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తుండగా.. స్టేడియంలోని ఫాన్స్ 'హమారీ భాభీ కైసీ హో, సారా భాభీ జైసీ హో' అంటూ గట్టిగా అరిచారు. ఇది విని మైదానం మధ్యలో ఉన్న విరాట్ కోహ్లీ ఫన్నీ రియాక్షన్ ఇచ్చాడు. అడగండి, ఇంకా గట్టిగా అరవండి అనే అర్ధం వచ్చేలా చేతులతో సైగలు చేశాడు. దాంతో ఫాన్స్ మరింత రెచ్చిపోయారు. అయితే బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న గిల్ మాత్రం ఏమీ అనకుండా ఉండిపోయాడు. ఇందుకుసంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అయింది. ఈ వీడియో చూసిన ఫాన్స్, నెటిజన్లు లైకుల, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
గత సంవత్సరం శుభమాన్ గిల్ మరియు సారా అలీ ఖాన్ పేర్లు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయ్యాయి. ఇద్దరూ కలిసి డిన్నర్ చేస్తున్న వీడియో, ఫొటోస్ నెట్టింట చక్కర్లు కొట్టాయి. అప్పటి నుంచి శుభమాన్ మరియు సారా డేటింగ్ వార్తలు ఊపందుకున్నాయి. అయితే ప్రస్తుతానికి తమ రిలేషన్‌షిప్ గురించి ఇద్దరు కూడా స్పందించలేదు. ఆటతో గిల్, సినిమాలతో సారా బిజీగా ఉన్నారు. అంతకుముందు సారా టెండూల్కర్‌తో గిల్ డేటింగ్ అంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
Also Read: Car Price Hike 2023: బడ్జెట్ 2023కు ముందే ఈ కార్ల ధరలు పెరిగాయి.. ఇప్పుడు మరోసారి పెరుగుతాయా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.