‘The Elephant Whisperers’ on OTT: ఆస్కార్ గెలిచిన ఎలిఫెంట్ విస్పరర్స్ ఏ ఓటీటీలో చూడాలో తెలుసా?
The Elephant Whispers On OTT: `ది ఎలిఫెంట్ విస్పర్స్` ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ఆస్కార్ అవార్డును గెలుచుకుంది, దానిని ఎక్కడ చూడాలంటే?
Where to Watch The Elephant Whispers: నిర్మాత గునీత్ మోంగా తెరకెక్కించిన డాక్యుమెంటరీ 'ది ఎలిఫెంట్ విస్పరర్స్' ఆస్కార్ అవార్డు 2023ని గెలుచుకోవడం ద్వారా దేశం గర్వించేలా చేసింది. ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు సాంగ్ తో పాటు ఈ డాక్యుమెంటరీ కూడా ఆస్కార్ అవార్డు అందుకోవడంతో అందరి దృష్టి ఈ డాక్యుమెంటరీ మీద పడింది.
నిజానికి 'ది ఎలిఫెంట్ విస్పర్స్' ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ఆస్కార్ అవార్డును గెలుచుకుంది. అంతర్జాతీయ వేదికపై డాక్యుమెంటరీ చిత్రం సాధించిన ఈ విజయంపై దేశం మొత్తం గర్విస్తోంది. గునీత్ మోంగా నిర్మించిన 'ది ఎలిఫెంట్ విస్పర్స్'ని కార్తికి గోన్సాల్వేస్ డైరెక్ట్ చేశారు. ఆమె మొదటి చిత్రంగా తెరకెక్కిన ఈ డాక్యుమెంటరీకి గానూ ఆ ఇద్దరూ ఆస్కార్ అవార్డును గెలుచుకున్నారు.
అవార్డు ప్రకటించిన వెంటనే గునీత్, కార్తికి ఆనందం పట్టలేక వేదికపైకి చేరుకుని సగర్వంగా అవార్డును కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా, కార్తికి తన విజేత ప్రసంగంలో అవార్డును దేశానికి తన కుటుంబానికి అంకితం చేశారు.
OTTలో 'ది ఎలిఫెంట్ విస్పర్స్' ఎక్కడ అందుబాటులో ఉంది?
అయితే మీరు ఈ ఆస్కార్ అవార్డు గెలుచుకున్న డాక్యుమెంటరీ 'ది ఎలిఫెంట్ విస్పర్స్'ని చూడాలని ఆలోచిస్తున్నట్లయితే, ఈ డాక్యుమెంటరీ OTT ప్లాట్‌ఫారమ్‌లో అందుబాటులో ఉంది. ఈ డాక్యుమెంటరీని మనం నెట్‌ఫ్లిక్స్‌లో చూడవచ్చు.
ది ఎలిఫెంట్ విస్పర్స్' కథ ఏంటంటే?
ఈ డాక్యుమెంటరీ కథ రెండు ఏనుగులు సంరక్షించే బోమన్, బేల చుట్టూ 'ది ఎలిఫెంట్ విస్పర్స్' అల్లుకున్నారు. ఈ డాక్యుమెంటరీ ప్రకృతితో ముడిపడి ఉంది. డాక్యుమెంటరీ కథ మొత్తం ఏనుగు, దాని యజమాని ప్రేమపై కేంద్రీకరించబడింది. కథలో ఇద్దరి బంధం హృదయాలను గెలుచుకుని అందరినీ ఆకట్టుకుంది. నిజానికి ప్రియాంక చోప్రా కూడా ఈ సినిమాపై ప్రశంసలు కురిపించింది. ప్రియాంక తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఇలా రాసింది, “ఎమోషన్స్‌తో నిండిన డాక్యుమెంటరీ, నేను ఇటీవల చూశాను, నాకు చాలా నచ్చింది. ఈ అద్భుతమైన కథను చూపించినందుకు కార్తికీ గోన్సాల్వేస్, గునీత్ మోగాలకు ధన్యవాదాలు అని ఆమె పేర్కొంది.
Also Read: Keerthy Suresh Photos: చీరలో సెగలు రేపేస్తున్న కీర్తి సురేష్... బ్లాక్ శారీలో హాట్ అవతార్ లో దర్శనం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook