బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 నుంచి నెక్ట్స్ ఎలిమినేషన్ ఎవరు
తెలుగులో ప్రసారమవుతున్న అతి పెద్ద రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ 5. 11 వారాలు పూర్తి చేసుకున్న బిగ్‌బాస్ షోలో ఇక మిగిలింది టాప్ 8 మాత్రమే. నెక్స్ట్ వీక్ ఎవరు ఎలిమినేట్ కానున్నారనేది పరిశీలిద్దాం.
తెలుగులో ప్రసారమవుతున్న అతి పెద్ద రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ 5. 11 వారాలు పూర్తి చేసుకున్న బిగ్‌బాస్ షోలో ఇక మిగిలింది టాప్ 8 మాత్రమే. నెక్స్ట్ వీక్ ఎవరు ఎలిమినేట్ కానున్నారనేది పరిశీలిద్దాం.
టెలివిజన్‌పై అత్యంత ప్రాచుర్యం పొందిన షో బిగ్‌బాస్(BiggBoss). ప్రతి భాషలోనూ హిట్ షో. తెలుగులో ఇప్పుడు సీజన్ 5 జరుగుతోంది. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 19 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమై ఇప్పుడు టాప్ 8 మిగిలారు. ఇప్పటికే 11 వారాలు పూర్తి చేసుకున్న బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5..12 వారం ప్రారంభమైంది. ఈ సారి ఎలిమినేషన్‌లో ఏకంగా మానస్ తప్ప..మిగిలిన ఏడుగురు ఉండటం విశేషం.
గత వారం అంటే 11వ వారంలో అనీ మాస్టర్(Ani Master)ఎలిమినేట్ అయింది. ఇప్పుడు 12వ వారం నామినేషన్ పర్వంలో యాంకర్ రవి, కాజల్, సన్నీ, శ్రీరామచంద్ర, సిరి, ప్రియాంక, షణ్ముఖ్ ఉన్నారు. గత వారం అనీ మాస్టర్ హౌస్ నుంచి నిష్క్రమించింది. మరి ఈ వారం ఎవరు వెళ్తారనేది ఆసక్తిగా మారింది. గత వారం హౌస్ నుంచి నిష్క్రమించిన అనీ మాస్టర్..వారానికి 3 లక్షల రూపాయల చొప్పున 33 లక్షలు సంపాదించింది. వాస్తవానికి టాప్ 5లో ఉంటుందనే ప్రచారం సాగినా..ఆమె వ్యవహారశైలి, ప్రవర్తన కారణంగా ప్రేక్షకులు వ్యతిరేకత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా కాజల్‌తో ఘర్షణ పడిన వైనం చాలామందికి చికాకు తెప్పించింది.
ఈసారి నామినేషన్‌లలో(Nominations) కాజల్, సిరి, ప్రియాంకలు డేంజర్ జోన్‌లో ఉన్నారనే ప్రచారం సాగుతోంది. ప్రియాంక(Priyanka)ఈసారి కచ్చితంగా ఎలిమినేట్ అవుతుందనే ప్రచారం జరుగుతోంది. ఎలిమినేషన్ అవకాశాలు ఈసారి ప్రియాంకకే ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి.10 వ వారంలో జెస్సీ అనారోగ్యం కారణంగా కాజల్, మానస్‌లు సేవ్ అయిన పరిస్థితి తెలిసిందే. ప్రస్తుతం ఎలిమినేషన్‌లో లేని మానస్ స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా కొనసాగుతున్నాడు. 12వ వారం నామినేషన్ సందర్భంగా ఒకరిపై మరొకరు నిందలు వేసుకుంటూ వేడి పుట్టించారు. సింగర్ శ్రీరామచంద్ర అయితే సన్నీపై ఓ స్థాయిలో విరుచుకుపడ్డాడు. సన్నీ ఆటతీరుపై అసహనం వ్యక్తం చేశాడు. అటు సన్నీ కూడా శ్రీరామచంద్రకు దీటైన సమాధానమిచ్చాడు. మొత్తానికి ఈసారి ప్రియాంకకే ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
Also read: మూడు రాజధానుల చట్టం ఉపసంహరణపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook