Who is Sapna Gill in Prithvi Shaw’s Issue: మహారాష్ట్రలోని ముంబై శాంతా క్రూజ్ విమానాశ్రయం సమీపంలోని ఓ లగ్జరీ హోటల్ బయట జరిగిన గొడవ కారణంగా ఇండియా క్రికెటర్ పృథ్వీ షా అనూహ్యంగా వార్తల్లోకి ఎక్కాడు. అయితే పృథ్వీ షాతో గొడవకు సంబంధించి ఒక మహిళ అరెస్ట్ అవగా అసలు ఆ మహిళ ఎవరు? ఎందుకు  పృథ్వీ షా మీద రెచ్చిపోయింది అనే వివరాల్లోకి వెళ్లి పరిశీలిద్దాం. నిజానికి క్రికెటర్ పృథ్వీ షా, తన స్నేహితుడు ఆశిష్ యాదవ్‌‌తో కలిసి బుధవారం మధ్యాహ్నం శాంతా క్రజ్ విమానాశ్రయం సమీపంలోని సహారా స్టార్ హోటల్‌లో లంచ్ కోసం వెళ్లారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అప్పటికే అక్కడున్న సప్నా గిల్, సోబిత్ ఠాకూర్, సహా వారి అనుచరులు పృథ్వీ షాతో సెల్ఫీలు దిగడానికి ప్రయత్నించారు. దీంతో షా వారితో కలిసి సెల్ఫీలు దిగినా వారు ఇంకా ఇంకా సెల్ఫీలు కావాలని అడుగుతూ ఇబ్బంది పెట్టదాంతో హోటల్‌ మేనేజర్‌ జోక్యం చేసుకుని సప్నా గిల్, సోబిత్ ఠాకూర్ సహా అందరినీ హోటల్‌ నుంచి బయటకు పంపించేశారు. దీన్ని అవమానంగా భావించి పృథ్వీ షా, ఆశిష్‌ యాదవ్‌తో గొడవకు దిగారు గిల్ అండ్ కో. షా, ఆశిష్‌ ప్రయాణిస్తున్న బీఎండబ్ల్యూ కారును వెంబడించి బేస్‌బాల్‌ స్టిక్‌తో కారు ముందు, వెనక అద్దాలను పగల గొట్టడంతో పృథ్వి షా, ఆశిష్‌ ఇద్దరు భయపడిపోయారు.


ఆపై ముంబై పోలీసులను ఆశిష్‌ ఆశ్రయించడంతో సప్నా గిల్ సహా 8 మంది నిందితులపై కేసు నమోదు చేశారు. ఇక సప్నా గిల్ ఒక సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్. ఆమె సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో తన డ్యాన్స్ వీడియోలో షేర్ చేస్తూ ఉంటుంది అలాగే ఫ్యాషన్‌కు సంబంధించిన వినోదాత్మక ఫోటోలు అలాగే వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటుంది ఆమె ఇన్స్టా హ్యాండిల్ - sapnagillofficialలో ఆమెకు 2,19,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె వాస్తవానికి పంజాబ్‌లోని చండీగఢ్‌కు చెందిన మహిళ అయినా ప్రస్తుతం మహారాష్ట్రలోని ముంబై నగరంలో నివసిస్తోంది.


ఇక సప్నా గిల్ సాధారణ ఇన్‌ఫ్లుయెన్సర్ కాదు, ఆమె మోడల్ అలాగే భోజ్‌పురి సినిమాల్లో కూడా ఆమె నటించింది. ఇక  సప్నా గిల్ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో 2 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉండగా గిల్ ప్రతిరోజూ తన గ్లామరస్ చిత్రాలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంటుంది. ఇక సప్నా గిల్ "కాశీ అమర్‌నాథ్", "మేరా వానత్" వంటి భోజ్‌పురి సినిమాల్లో కూడా నటించింది.


అంతేకాదు ఈ సినిమాల్లో సప్నా గిల్ రవి కిషన్, దినేష్ లాల్ యాదవ్ సహా ఆమ్రపాలి దూబే వంటి భోజ్‌పురి చిత్ర పరిశ్రమలోని టాప్ స్టార్స్ తో కలిసి నటించింది. పనిచేశారు. సప్నా చాలా అందంగా ఉండడంతో ఆమె అభిమానులు సోషల్ మీడియాలో ఆమె వీడియోలను చాలా ఎంకరేజ్ చేస్తారు. ఇక ఆ సినిమాలు మాత్రమే కాదు ఆమె నిరాహువా చలాల్ లండన్‌ అనే సినిమాలో కూడా పని చేసింది. ఇక ఇటీవలే ఆమె నటించిన మేరా వతన్ 2021లో విడుదలైంది.


Also Read: Prithvi Shaw Attack: పృథ్వీ షా కారుపై దాడి.. ఇద్దరిని అరెస్ట్ చేసిన ముంబై పోలీసులు!


Also Read: IND vs AUS: రెండో టెస్ట్ నుంచి సూర్యకుమార్ ఔట్.. స్టార్ బ్యాటర్ ఇన్! టాస్ నెగ్గిన ఆస్ట్రేలియా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook