Wild Dog Trailer: నాగార్జున అప్‌కమింగ్ యాక్షన్ థ్రిల్లర్ వైల్డ్ డాగ్ మూవీ ట్రైలర్ వచ్చేసింది. అహిశోర్ సోలోమన్ డైరెక్ట్ చేసిన వైల్డ్ డాగ్ మూవీలో నాగార్జున అక్కినేని విజయ్ వర్మ అనే NIA officer పాత్ర పోషిస్తున్నాడు. టెర్రరిస్టులను వెంటాడి, వారిని అరెస్ట్ చేయకుండా ఎన్‌కౌంటర్ చేసే ఎన్ఐఏ ఆఫీసర్ పాత్రలో నాగ్ కనిపించనున్నాడు. అందుకే అందరూ అతడిని వైల్డ్ డాగ్ అంటారని, ఆ కోణంలోంచే సినిమాకు కూడా Wild Dog అనే టైటిల్ ఫిక్స్ చేశారని మూవీ యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Also read : Saranga Dariya song controversy కి ఫుల్‌స్టాప్ పెట్టిన శేఖర్ కమ్ముల


వైల్డ్ డాగ్ సినిమా 2007లో కోఠిలో జరిగిన Gokul Chat bomb blast scene తో ప్రారంభమవుతుందని, పలు యధార్థ ఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిందని ట్రైలర్‌నుబట్టి చూస్తే అర్థమవుతోంది. సినిమాలో అనేక కీలక సన్నివేశాలు హైదరాబాద్, హిమాచల్ ప్రదేశ్‌లో షూట్ చేశారు. Saiyami Kher, Prakash Sudarshan, Ali Reza, Actress Dia Mirza ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. వైల్డ్ డాగ్ ఎలా ఉందో తెలియాలంటే, మ్యాటినీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న Wild Dog movie release అయ్యే వరకు వేచిచూడాల్సిందే.