Will Smith: భార్యపై జోకులు.. స్టేజ్ పైనే హోస్ట్ చెంప పగలగొట్టిన స్టార్ హీరో! కేసు నమోదు.. (వీడియో)!
Will Smith Punches Chris Rock Over Joke About Wife. ఆస్కార్ అవార్డ్స్ 2022 వేడుకల్లో హాలీవుడ్ స్టార్ హీరో విల్ స్మిత్.. ప్రముఖ కమెడియన్, హోస్ట్ క్రిస్ రాక్ చెంప పగలగొట్టారు.
Will Smith slap Chris Rock Over Joke About his Wife Jada Pinkett in Oscars 2022: ప్రపంచ సినీ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనవి అకాడమి అవార్డ్స్ (ఆస్కార్ అవార్డ్స్). కరోనా వైరస్ మహమ్మారి కారణంగా.. రెండేళ్ల తర్వాత ఆస్కార్ అవార్డ్స్ వేడుకలు ఘనంగా జరిగాయి. దాంతో భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. ఎంతో అట్టహసంగా జరిగిన ఈ ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవంలో ఎవరూ ఊహించని ఘటన జరిగింది. హాలీవుడ్ స్టార్ హీరో విల్ స్మిత్.. ప్రముఖ కమెడియన్, హోస్ట్ క్రిస్ రాక్ చెంప పగలగొట్టారు. ముందుగా అందరూ షోలో భాగంగానే సరదాగా జరిగిన ఘటన అని భావించినప్పటికీ.. తర్వాత అసలు విషయం తెలుసుకొని షాక్ అయ్యారు. అసలు విషయం ఏంటంటే...
హాలీవుడ్ ప్రముఖ కమెడియన్ క్రిస్ రాక్.. ఆస్కార్ అవార్డ్స్ వేడుకకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. అవార్డుల ప్రధానోత్సవం జరుగుతుంది. ఈ క్రమంలో ఉత్తమ డాక్యుమెంటరీ అవార్డు ప్రకటించడానికి ముందు క్రిస్ రాక్ వీక్షకుల్ని నవ్వించే ప్రయత్నం చేశారు. ఇందుకోసం హీరో విల్ స్మిత్ సతీమణి జాడా పింకెట్ ప్రస్తావనను తీసుకొచ్చారు. జుట్టు పూర్తిగా తొలగించుకొని ఆస్కార్ వేడుకకు హాజరైన పింకెట్‌ను.. జీఐజేన్ సినిమాలో డెమి మూర్ ప్రదర్శించిన పాత్రతో పోల్చారు. జీఐజేన్ చిత్రంలో డెమి మూర్ పూర్తిగా గుండుతో ఉంటారు. అందుకే పింకెట్‌ను ఉద్దేశించి జీఐజేన్ చిత్రం సీక్వెల్‌లో నటిస్తున్నారా? అని సరదాగా క్రిస్ రాక్ అడిగారు.
క్రిస్ రాక్ జోక్‌ను విన్న విల్ స్మిత్.. నవ్వుతూ కనిపించారు. అయితే ఒక్కసారిగా కుర్చీ నుంచి లేచి వేదికపైకి నడుచుకుంటూ వెళ్లారు. స్మిత్ ఆగ్రహాన్ని పసిగట్టలేకపోయిన క్రిస్.. అతనిని స్వాగతించారు. క్రిస్ వద్దకు వెళ్లిన స్మిత్.. చెంప ఛెళ్లుమనిపించారు. ఆ వెంటనే స్టేజ్ దిగివచ్చి.. కుర్చీలో కూర్చుని క్రిస్‌పై గట్టిగా అరిచారు. నా భార్య పేరు నీ నోటి నుంచి రావొద్దు అంటూ గట్టిగా హెచ్చరించారు. ఇంతజరిగినా క్రిస్ మాత్రం ఈ ఘటనను సీరియస్‌గా తీసుకోలేదు. స్మిత్ హెచ్చరికకు 'ఓకే' అని సమాధానం ఇచ్చి.. టెలివిజన్ చరిత్రలోనే ఇది ఓ గొప్ప రాత్రి అని వ్యాఖ్యానించారు.
ఈ ఘటన అనంతరం వేదికపైకి వచ్చిన సీన్ కోంబ్స్ ఇద్దరినీ సముదాయించారు. ఆపై అవార్డుల కార్యక్రమాన్ని ముందుకు కొనసాగించారు. ఈ ఘటన జరిగిన 40 నిమిషాల తర్వాత 'ఉత్తమ నటుడి'గా అవార్డు అందుకునేందుకు విల్ స్మిత్ వేదికపైకి వచ్చారు. అవార్డు తీసుకున్న అనంతరం అకాడమీ, సహచర నామినీలకు క్షమాపణలు చెప్పారు. అయితే విల్ స్మిత్ చెంపదెబ్బ కొట్టినా.. క్రిస్ రాక్ పోలీస్ రిపోర్ట్ దాఖలు చేయడానికి నిరాకరించారట. దాంతో ఈ అతడిపై అందరు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Also Read: RRR Movie: ఆర్‌ఆర్‌ఆర్ సినిమాపై స్పందించని పవన్ కళ్యాణ్.. సినిమా ఇంకా చూడలేదా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook