Yami Gautam pregnancy: తల్లి కాబోతున్న యామీ గౌతమ్.. ఫ్రూఫ్ ఇదిగో..!
Yami Gautam: బాలీవుడ్ బ్యూటీ యామీ గౌతమ్ తల్లి కాబోతుంది. ఈ విషయాన్ని తన భర్త ఆదిత్య ధర్ తో కలిసి అనౌన్స్ చేసింది ఈ ముద్దుగుమ్మ. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Yami Gautam is pregnant: టీవీ యాడ్స్ ల్లో నటించి.. ఆ తర్వాత కొంత కాలానికి హీరోయిన్ స్థాయికి ఎదిగింది నటి యామీ గౌతమ్. 'నువ్విలా' చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 'గౌరవం' అనే సినిమా చేసింది. ఈ రెండు సినిమాలు పెద్దగా ఆడకపోవడంతో ఈ అమ్మడుకు తెలుగులో అవకాశాలు రాలేదు. అయితే ఈ బ్యూటీ బాలీవుడ్ లో సక్సెస్ అయింది. విక్కీ డోనర్, బద్లాపూర్, సనమ్ రే, కాబిల్, సర్కార్ 3, ఓమైగాడ్ 2 చిత్రాలతో మంచి పేరు తెచ్చుకుంది. మళ్లీ అడపదడపా తెలుగు సినిమాల్లో నటించింది. నితిన్ తో కొరియర్ బాయ్ కల్యాణ్ చేసింది. ప్రస్తుతం 'ఆర్టికల్ 370' అనే మూవీలో నటిస్తోంది యామీ.
నటిగా పుల్ బిజీగా ఉన్న సమయంలోనే 2021 జూన్‌లో డైరెక్టర్ ఆదిత్య ధర్‌ను వివాహం చేసుకుంది యామీ. తాజాగా ఈ జంట అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో తాము తల్లిదండ్రులు కాబోతున్నామంటూ ప్రకటించింది. ఇవాళ జరిగిన 'ఆర్టికల్ 370'’ (Article 370 Trailer launch) మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఈ జంట ప్రెగ్నెన్సీ ప్రకటన చేసింది. దీంతో పలువురు అభిమానులు, సెలబ్రిటీలు యామీ ధర్ జంటకు విషెస్ చెబుతున్నారు. ప్రస్తుతం యామి ఐదున్నర నెలల గర్భవతిగా తెలుస్తోంది. 2019లో వచ్చిన 'యూరి: ది సర్జికల్ స్టైక్' మూవీ సెట్స్ లో కలిసిన ఈ జంట రెండేళ్లపాటు డేటింగ్ చేసి ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు.
Also read: Ashika Ranganath: చూపులతో మెస్మరైజ్ చేస్తున్న వరాలు.. ఆషికా లేటెస్ట్ పిక్స్ అదుర్స్..
Also Read: Ram Charan: రామ్ చరణ్ సినిమాలో బంపర్ ఆఫర్ కొట్టేసిన ఎన్టీఆర్ భామ..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter