Yash - Toxic: ప్యాన్ ఇండియా స్టార్ ఇమేజ్ తర్వాత యశ్ నుంచి రాబోతున్న చిత్రం ‘టాక్సిస్’. కేజీఎఫ్ పార్ట్ -1, కేజీఎఫ్ పార్ట్ 2 తర్వాత ఎటువంటి సినిమా చేయాలనే దానిపై యశ్ ఎన్నో తర్జన భర్జనల తర్వాత ‘టాక్సిస్’ అనే డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీతో ఆడియన్స్ ముందు రాబోతున్నాడు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. జనవరి 8న ఆయన పుట్టినరోజు సందర్భంగా  ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోనప్స్’ అంటూ స్నీక్ పీక్ విడుదల చేశారు. తాజాగా విడుదల చేసిన ఈ వీడియోలో  య‌ష్ స్టైలిష్ లుక్‌తో క‌నిపిస్తున్నారు. రొటీన్‌కు భిన్నంగా బోల్డ్ కంటెంట్‌తో సినిమా క‌థ‌ను సిల్వర్ స్క్రీన్ పై  హ‌ద్దుల‌ను చెరిపేసేలా బ‌ర్త్ డే పీక్ ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

య‌ష్ గ‌డ్డంతో పెడోరా, సూట్ డ్రెస్ వేసుకుని సిగార్ కాలుస్తూ స్టైలిష్‌గా క‌నిపిస్తూ క్ల‌బ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌టాన్ని, క్ల‌బ్‌లోని ప్ర‌తీ ఒక్క‌రి దృష్టిని య‌ష్ ఆక‌ర్షిస్తూ ఉంది. ఆయ‌న క్ల‌బ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న తీరు వావ్ అనేలా మ‌రో డిఫ‌రెంట్ అవ‌తార్‌లో రాకింగ్ స్టార్ మెప్పించేలా ఉంాది.  బోల్డ్‌గా, రెచ్చగొట్టే మూమెంట్స్ తో నిండిన ఈ గ్లింప్స్‌ ఆడియన్స్ ను మెస్మరైజ్ చేస్తోంది.  కంప్లీట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అని చెప్పాలి.




‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోనప్స్‌’ చిత్రాన్ని..ఇంటర్నేషనల్ లెవల్లో గుర్తింపు పొందిన , సన్ డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో నేషనల్ అవార్డ్, గ్లోబల్ ఫిల్మ్ మేకింగ్ అవార్డ్‌తో పాటు పలు అవార్డులు అందుకున్న గీతూ మోహ‌న్ దాస్ డైరెక్ట్ చేస్తున్నారు. కె.వి.ఎన్‌.ప్రొడ‌క్ష‌న్స్‌, మాన్‌స్ట‌ర్ మైండ్ క్రియేష‌న్స్ ప‌తాకాల‌పై వెంక‌ట్ కె.నారాయ‌ణ‌, య‌ష్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని అన్‌కాంప్ర‌మైజ్డ్‌గా రూపొందిస్తున్నారు మేక‌ర్స్‌.


బాహుబలి తర్వాత ప్రభాస్.. ప్యాన్ ఇండియా స్టార్ గా బాలీవుడ్ లో స్ధిర పడిపోయాడు. బాహుబలి 2 తర్వాత ‘సాహో’, ఆదిపురుష్, సలార్, కల్కి సినిమాలతో అక్కడ వరుసగా మంచి వసూళ్లనే రాబట్టాడు. అటు ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ ‘దేవర’ తో ఓ మోస్తరుగా విజయం సాధించాడనే చెప్పాలి.


అల్లు అర్జున్ ‘పుష్ప 2’ తో సంచలనమే రేపాడు. పుష్ప 2 తర్వాత రాబోయే చిత్రాలు ఏ రకంగా పర్ఫామ్ చేస్తాయనే అంశంపై బన్ని ప్యాన్ ఇండియా ఇమేజ ఆధారపడి ఉంది. పుష్ప సిరీస్ ను ఆదరించిన బాలీవుడ్ ప్రేక్షకులు ఆ తర్వాత చిత్రాలను కూడా ఇదే రేంజ్ లో ఆదరిస్తారా అనేది చూడాలి. మరోవైపు యశ్ కూడా ‘టాక్సిస్’తో అతని ముందు పెద్ద సవాలే ఉంది. దీన్ని ఏ రకంగా అధిగమిస్తాడనేది చూడాలి.


ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..


ఇదీ చదవండి: పెళ్లి తర్వాత భారీగా పెరిగిన శోభిత ఆస్తులు.. ఎవరి ఎక్స్ పెక్ట్ చేయరు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.