Samantha's Yashoda Movie Trailer Out Released: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'యశోద'. పాన్‌ ఇండియా కథాంశంతో యాక్షన్‌ థ్రిల్లర్ సినిమాగా యశోద రూపుదిద్దుకుంది. ఈ చిత్రానికి హరి శంకర్ మరియు హరీశ్ నారాయణ దర్శకత్వం వహించారు. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక క్రిష్ణ ప్రసాద్ యశోద సినిమాను నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిన యశోద సినిమా నవంబరు 11న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో కొద్ది సేపటి క్రితం సినిమా ట్రైలర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

యశోద చిత్రం నవంబరు 11న ప్రేక్షకుల ముందుకురానున్న సందర్భంగా చిత్ర బృందం గురువారం ప్రముఖ కథానాయకులతో ట్రైలర్‌ను విడుదల చేయించింది. తెలుగు ట్రైలర్‌ను రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ విడుదల చేశారు. 'నీకు ఎప్పుడైనా రెండు గుండె చప్పుళ్లు వినిపించాయా?.. బిడ్డను కడుపులో మోస్తున్న తల్లికి మాత్రమే అది వినిపిస్తుంది' అని సమంత అడిగే సంభాషణతో ట్రైలర్‌ ఆరంభం అయింది. 'నీకు కావల్సింది డబ్బు.. వాళ్లకు కావాల్సింది బిడ్డ', 'నువ్వు కనే బిడ్డ ఏ బిలియనీర్‌ ఇంటికో, కోటీశ్వరుడి ఇంటికో వెళ్తుంది' అనే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. 


ట్రైలర్‌లో చివరలో.. 'యశోద ఎవరో తెలుసు కదా, ఆ కృష్ణ పరమాత్ముడిని పెంచిన తల్లి' అంటూ సమంత చెప్పిన డైలాగ్ సినిమాపై ఆసక్తిని పెంచింది. ట్రైలర్‌ను చూస్తే.. పేదరికంలో ఉన్న యశోద డబ్బు కోసం సరోగసి పద్దతిలో బిడ్డను కనివ్వడానికి ఒప్పుకున్నట్టు అర్థమతోంది. బిడ్డను కనే క్రమంలో ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి, వాటిని సామ్ ఎలా ఎదుర్కొన్నారన్నదే కథగా అర్ధమవుతోంది. 



పాన్‌ ఇండియా సినిమా వస్తున్న యశోద చిత్రం కన్నడ, మలయాళ, తమిళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. తెలుగు ట్రైలర్‌ను విజయ్‌ దేవరకొండ విడుదల చేయగా..మిగతా ట్రైలర్స్‌ను రక్షిత్‌ శెట్టి, దుల్కర్‌ సల్మాన్, సూర్య, వరుణ్‌ ధవన్‌ లాంఛ్‌ చేశారు. ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్‌కుమార్‌, ఉన్ని ముకుందన్‌, రావు రమేష్‌, మురళి శర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. 


Also Read: టూపీస్ బికినీలో ఇలియానా.. హాట్ హాట్ అందాలకు ఊపిరి పీల్చుకోలేకపోతున్న కుర్రకారు!


Also Read: స్టేడియంలో అమ్మాయికి ప్రపోజ్ చేసిన భారత ఫ్యాన్.. హగ్గులు, ముద్దులతో మైదానంలో రచ్చ!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook