యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన అరవింద సమేత మూవీ ఆయన కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లిన సినిమా. ఫ్యాక్షన్ నేపథ్యంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో ఎన్టీఆర్ పోషించిన పాత్ర ఆయనకు మంచి పేరు తీసుకొచ్చింది. సెంటిమెంట్, ఎమోషన్స్, యాక్షన్.. అన్నీ కలగలిపిన ఈ సినిమాకు ఎస్ఎస్ థమన్ అందించిన మ్యూజిక్ మరో ప్లస్ పాయింట్‌. కథలో భాగంగా కథతోపాటుగా ట్రావెల్ చేసినట్టుగా వుండే పాటలు ఆడియెన్స్‌ని తెరకు కట్టిపడేశాయి. ఈ సినిమా చేస్తున్న సమయంలోనే ఎన్టీఆర్ రోడ్డు ప్రమాదంలో తన తండ్రి హరికృష్ణను కోల్పోయారు. అరవింద సమేత ఆడియో లాంచింగ్ ఫంక్షన్‌లోనూ ఎన్టీఆర్ తన తండ్రిని స్మరించుకుని మాట్లాడుతూ.. ఇప్పటివరకు ఎన్నో సినిమాలు చేసిన తాను.. ఏనాడూ, ఏ సినిమాలోనూ కొరివి పెట్టడం, చితికి నిప్పంటించడం వంటి సీన్స్ చేయలేదు కానీ మొదటిసారి అరవింద సమేత సినిమాలో చేశానని గుర్తుచేసుకుని ఆవేదన వ్యక్తంచేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సినిమాకు, నిజజీవితానికి సంబంధం లేనప్పటికీ.. ఎన్టీఆర్‌ని ఆ సన్నివేశం తీవ్రంగా కదిలించింది. కేవలం ఎన్టీఆర్‌నే కాదు.. సినిమా చూస్తున్నప్పుడు ఎన్టీఆర్ అభిమానులను సైతం కదిలించిన సాంగ్ అది. సెంటిమెంట్ సాంగ్‌కు ఎమోషన్ టచ్ ఇస్తూ థమన్ కంపోజ్ చేసిన మ్యూజిక్ పాటకు ప్రాణం పోసింది. ఈ సినిమాకు మ్యూజిక్ పార్టనర్ అయిన జీ మ్యూజిక్ తాజాగా ఈ సినిమా నుంచి ఏడపోయినాడో ఫుల్ వీడియో సాంగ్‌ని విడుదల చేసింది.