యోయో హనీ సింగ్ సీక్రెట్ ఎఫైర్స్, మ్యారేజ్, అతడి లైంగిక వాంఛలపై సంచలన విషయాలు వెల్లడించిన భార్య
Yo Yo Honey Singh domestic violence case: యోయో హనీ సింగ్‌పై అతడి భార్య శాలిని తల్వార్ అనేక సంచలన విషయాలు బయటపెట్టింది. తనను లైంగికంగా, మానసికంగా, ఆర్థికంగా అన్నివిధాల వేధింపులకు (Sexual, physical, verbal, and emotional abuse) గురిచేస్తున్నాడని ఢిల్లీలోని తీస్ హజారి కోర్టులో యోయో హని సింగ్‌పై ఫిర్యాదు చేసిన శాలిని తల్వార్.. తన ఫిర్యాదుతో అతడి బాగోతాలను ఒక్కొక్కటిగా బయటపెట్టింది.
Yo Yo Honey Singh domestic violence case: యోయో హనీ సింగ్‌పై అతడి భార్య శాలిని తల్వార్ అనేక సంచలన విషయాలు బయటపెట్టింది. తనను లైంగికంగా, మానసికంగా, ఆర్థికంగా అన్నివిధాల వేధింపులకు (Sexual, physical, verbal, and emotional abuse) గురిచేస్తున్నాడని ఢిల్లీలోని తీస్ హజారి కోర్టులో యోయో హని సింగ్‌పై ఫిర్యాదు చేసిన శాలిని తల్వార్.. తన ఫిర్యాదుతో అతడి బాగోతాలను ఒక్కొక్కటిగా బయటపెట్టింది. శాలిని తల్వార్ ఫిర్యాదుతో యోయో సింగ్‌పై ఇప్పటికే తీస్ హజారి కోర్టులో గృహ హింస చట్టం కింద కేసు నమోదు కాగా.. అతడి వివరణ కోరుతూ కోర్టు నోటీసులు కూడా జారీచేసింది.
Sexual harassment - లైంగిక వాంఛలు, వేధింపులు:
ఇదిలావుంటే, యోయో హనీ సింగ్ వేధింపుల గురించి శాలిని తల్వార్ రాసిన 118 పేజీల ఫిర్యాదు కాపీని పరిశీలిస్తే అనేక సంచలన విషయాలు మీడియా దృష్టికి వచ్చాయి. యో యో హనీ సింగ్‌కి చాలా మంది మహిళలతో వివాహేతర సంబంధాలు (extra-marital sex) ఉన్నాయని శాలిని ఆరోపించింది. వాళ్లతో తరచుగా సెక్సులో పాల్గొంటాడని యోయో హని సింగ్ లైంగిక వాంఛలపై సంచలన విషయాలు (సెక్సువల్ ఇంటెంట్స్) వెల్లడించింది. తన భర్త తమ పెళ్లి విషయాన్ని రహస్యంగా దాచిపెట్టి బయటి మహిళలతో సంబంధాలు పెట్టుకుని వారిని మోసం చేస్తున్నాడని శాలిని తన ఫిర్యాదులో పేర్కొంది.
Also read : ఇప్పుడు కాక ఇంకెప్పుడు మూవీపై వీహెచ్‌పీ, బీజేపి నేతలు పోలీసులకు ఫిర్యాదు
Kept his marriage secret - పెళ్లి విషయాన్ని దాచిపెట్టాడు:
తమ పెళ్లిని గోప్యంగా దాచిపెట్టి బ్యాచిలర్‌గా బయట తిరుగుతున్నాడని.. ఒకసారి తమ పెళ్లి ఫోటోలు (Yo Yo Honey Singh's marriage photos) సోషల్ మీడియాలో వైరల్ అవగా, అది ఇష్టం లేని తన భర్త తనకు నరకం చూపించాడని శాలిని ఆవేదన వ్యక్తంచేసింది. పెళ్లి అయిన విషయం బయటికి తెలిసినప్పుడు ఎంతో భయాందోళనలకు గురయ్యాడని శాలిని వాపోయింది.
Caught him red handed with a girl - సీక్రెట్ ఎఫైర్‌ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నా:
పంజాబి హీరోయిన్‌తో సీక్రెట్ ఎఫైర్ (Yo Yo Honey Singh secret affairs with heroines) పెట్టుకున్న యోయో హని సింగ్ అది నాకు తెలియడంతో నన్ను మరింత వేధించడం మొదలుపెట్టాడని చెప్పుకొచ్చింది. బ్రోన్ రంగ్ దే షూటింగ్ (Brown Rang De) సమయంలో తన భర్త మరొకరితో ఉండగా తాను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నానని.. దాంతో ఆ కోపంలో లిక్కర్ బాటిల్ తనపై విసిరేశాడని శాలిని తన ఫిర్యాదులో పేర్కొంది.
Also read : చిరు ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ఆచార్య మూవీ లేటెస్ట్ అప్‌డేట్స్
Childhood friends to husband-wife - బాల్యంలో స్నేహం నుంచి డేటింగ్, పెళ్లి:
యో యో హనీ సింగ్, శాలిని తల్వార్ పెళ్లికి ముందు ఒకరికొరకు బాగా తెలుసు. ఇంకా చెప్పాలంటే వాళ్లిద్దరు చిన్ననాటి స్నేహితులు. బాల్యంలో స్నేహంతో మొదలైన వాళ్ల పరిచయం ప్రేమగా మారింది. పెళ్లికి ముందు పదేళ్లపాటు డేటింగ్ చేసుకున్నారు. 2011, జనవరి 23న యో యో హని సింగ్, శాలిని తల్వార్‌ల పెళ్లి (Yo Yo Honey Singh's marriage) జరిగింది. పెళ్లి జరిగి కూడా పదేళ్లు పూర్తయ్యాయి. ఇంత కాలం పాటు అతడు పెట్టిన టార్చర్‌ను భరించానని, ఇక తన వల్ల కావడం లేదని శాలిన తల్వార్ కోర్టుకు ఫిర్యాదు చేసిన పిటిషన్‌లో పేర్కొంది.
Bollywood news: బాలీవుడ్‌లో టాక్ ఆఫ్ ది టౌన్:
ఫేమస్ ర్యాపర్‌గా, సింగర్‌గా మంచి పేరున్న యో యో హని సింగ్ గురించి శాలిని తల్వార్ (Yo Yo Honey Singh's wife Shalini Talwar complaint) చేసిన సంచలన ఆరోపణలు ప్రస్తుతం అటు బాలీవుడ్‌లోనూ, ఇటు మీడియాలోనూ టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాయి.
Also read : Nora Fatehi viral dance video: నోరా ఫతేహి డ్యాన్స్ చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే