Yo Yo Honey Singh’s wife Shalini Talwar: ఫేమస్ సింగర్ యో యో హనీ సింగ్‌పై అతడి భార్య శాలిని తల్వార్ గృహ హింస కేసు పెడుతూ ఢిల్లీలోని తీస్ హజారి కోర్టు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఎదుట ఫిర్యాదు చేశారు. తన భర్త యో యో హనీ సింగ్ తనను గృహ హింసకు గురిచేయడంతో పాటు లైంగిక వేధింపులు, మానసిక వేధింపులకు పాల్పడుతున్నాడని శాలిని తల్వార్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా ఆర్థికంగానూ యో యో హని సింగ్ తనను మోసం చేశాడని పోలీసుల ఎదుట వాపోయింది. గృహ హింస చట్టం కింద (Protection of Women from Domestic Violence Act) తనకు రక్షణ కల్పించాల్సిందిగా శాలిని తల్వార్ కోర్టుకు విన్నవించుకున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శాలిని తల్వార్ ఫిర్యాదుపై స్పందించిన తీస్ హజారి కోర్టు.. ఈ ఫిర్యాదుపై వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశిస్తూ యో యో హనీ సింగ్‌కి నోటీసులు జారీచేసింది. ఆగస్టు 28లోగా కోర్టుకు వివరణ ఇవ్వాల్సిందిగా కోర్టు యోయో హని సింగ్‌కి జారీచేసిన నోటీసుల్లో పేర్కొంది. అంతేకాకుండా ఈ కేసు విచారణ ముగిసే వరకు జాయింట్ ప్రాపర్టీలు ఏవీ అమ్మడానికి వీల్లేదని యోయో హని సింగ్‌ని ఆదేశిస్తూ శాలినికి అనుకూలంగా కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.


Also read : SI Suspended on sexual harassment charges: లైంగిక వేధింపులు: ఎస్సై శ్రీనివాస్ రెడ్డిని సస్పెండ్ చేసిన మహబూబాబాద్ ఎస్పీ


యో యో హనీ సింగ్ (Yo yo Honey Singh) భార్య శాలిని తల్వార్ చేసిన ఈ ఫిర్యాదుతో బాలీవుడ్ (Bollywood) సినీ పరిశ్రమతో పాటు ముంబై మీడియా వర్గాల్లోనూ ఈ డొమెస్టిక్ వయోలెన్స్ కేసు టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. యోయో హనీ సింగ్ అసలు పేరు హిర్దేస్ సింగ్ అనే సంగతి తెలిసిందే.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook