Parari Movie Review: యోగీశ్వర్ , అతిథి హీరో హీరోయిన్లుగా శ్రీ శంకర ఆర్ట్స్ బ్యానర్ పై గాలి ప్రత్యూష సమర్పణలో తెరకెక్కిన సినిమా ‘పరారీ’. ఈ సినిమాను సాయి శివాజీ దర్శకత్వంలో నిర్మాత జివివి గిరి నిర్మించారు. లవ్ -క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఎట్టకేలకు ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఆడియన్స్ ని ఎలా ఆకట్టుకుంది అనేది చూద్దాం పదండి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కథ: 
యోగి(యోగీశ్వర్ ), అతిథి(అతిథి) ఇద్దరూ ఒకే కాలేజ్లో చదువుతూ ప్రేమలో పడతారు. హీరో తండ్రి(షియాజి షిండే) ఒక బిజినెస్ మేన్. చాలా తీరిక లేకుండా గడిపేస్తూ ఉంటాడు. మరో పక్క యోగికి ఇద్దరు స్నేహితులు(జబర్దస్త్ రఘు కారుమంచి, భూపాల్) ఉంటారు. అందులో భూపాల్ శివాని(సైని)ని ప్రేమిస్తుంటారు. ఈ ఐదు మంది కలిసి అనుకోకుండా ఓ మర్డర్ మిస్టరీలో ఇరుక్కుంటారు. దాని నుంచి తప్పించుకోవడానికి అనేక రకాల ఇబ్బందులు పడుతుంటారు, అదే సమయంలో యోగీ తండ్రిని పాండే(మకరంద్ దేశముఖ్ పాండే) కిడ్నాప్ చేస్తాడు. యోగి మర్డర్ మిస్టరీ నుంచి ఎలా బయటపడ్డారు? కిడ్నాప్కు గురైన తన తండ్రిని ఎలా విడిపించుకున్నాడు? అతిథితో లవ్ ని ఎలా సక్సెస్ చేసుకున్నాడనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.


విశ్లేషణ: 
లవ్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీస్ ఎప్పుడూ ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. దానికి కావాల్సిన స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ గా రాసుకుంటే చాలు... ఆడియన్స్ ని థియేటర్లో రెండున్నర గంటల పాటు హాయిగా నవ్వుకునే లా కూర్చ బెట్టవచ్చని ఈ సినిమా ప్రూవ్ చేసింది. పరారీ’ దర్శకుడు సాయి శివాజీ ఈ చిత్రానికి ‘రన్ ఫర్ ఫన్’ అనే క్యాచీ ట్యాగ్ లైన్ పెట్టి ఈ సినిమాలో హీరో అండ్ బ్యాచ్ ని ఇంటర్వెల్ నుంచి పరుగులు పెట్టిస్తున్న క్రమాన్ని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంటర్వెల్ బ్యాంగ్ వరకు సరదాగా కాలేజీ లైఫ్... ఆ తర్వాత అత్తాపురం ఎపిసోడ్ తో కొంత అడల్ట్ కామెడీతో ప్రేక్షకులను ఎంగేజ్ చేసిన డైరెక్టర్ ఇంటర్వెల్ బ్యాంగ్ లో ట్విస్ట్ ఇచ్చి... సెకెండాఫ్ పై మర్డర్ మిస్టరీతో సినిమాని పరుగులు పెట్టించారు. ఇక మధ్యలో హీరో, హీరోయిన్, ఐటెం గర్ల్స్ తో చేయించిన డ్యాన్సులు మంచి ఊపు తెప్పించాయి. ఇక క్లైమాక్స్ సీన్ కూడా చాలా బాగుంది. మకరంద్ దేశ్ పాండే అండ్ బ్యాచ్ తో కంపోజ్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ కూడా బాగా నవ్విస్తుందని అనడంలో సందేహం లేదు. 


నటీనటులు:
హీరో యోగీశ్వర్ కొత్త కుర్రాడు అయినా ఆకట్టుకున్నారు. డ్యాన్సులు, ఫైట్లు చాలా ఈజ్ తో చేశారు. మాస్ ని మెప్పించే మ్యూజిక్ ఉండటంతో హీరో కూడా అందుకు తగ్గట్టుగానే డాన్స్ ఇరగదీసాడు. డైలాగ్ డెలివరీ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంది. హీరోయిన్ అతిథి పాత్రలో ఒదిగిపోయింది. హీరోతో పాటు చేసిన భూపాల్, ఆయనకు జోడీగా నటించిన శివాని సైని పాత్ర కూడా హైలైట్ అయింది. జబర్దస్త్ రఘు కారుమంచి, ఆలీ, సుమన్, షయాజీ షిండే తమ పాత్రల పరిథి మేర నటించారు. మకరంద్ దేశ్ పాండే. కామెడీ విలన్ పాత్రలో ఇమిడిపోయాడు. విలన్ శ్రవణ్ కాసేపే ఉన్నా. తన పాత్ర పరిధి మేరకు నటించి ఆకట్టుకున్నారు. 


టెక్నీకల్ టీమ్:
దర్శకుడు సాయి శివాజీ ఫన్ ఎపిసోడ్ ని ఎంగేజింగ్ గా తీయడమే కాదు సినిమా ఆద్యంతం నవ్వించారు. గరుడ వేగ అంజి అందించిన సినిమాటోగ్రఫీ సినిమాను రిచ్ గా చూపించేలా చేసింది. సాంగ్స్, ఫైట్స్ చిత్రీకరణ కూడా రిచ్ గా ఉంది. చక్రి తమ్ముడు మహిత్ నారాయణ్ అందించిన సంగీతం సినిమాకి హైలైట్ అయింది. రామజోగయ్య శాస్త్రి, భాస్కర భట్ల, మహిత్ నారాయణ్ రాసిన లిరిక్స్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. దివంగత సీనియర్ ఎడిటర్ గౌతం రాజు ఎడిటింగ్ బాగుంది. ఎక్కడా ఖర్చుకి వెనకాడకుండా సినిమా తీశారు నిర్మాత జి.వి.వి.గిరి. 


Rating:2.5/5


Also Read: IPL 2023 Opening ceremony: ఐపీఎల్ ఓపెనింగ్లో మెరవనున్న రష్మిక, కత్రినా..ఫ్రీగా ఎక్కడ చూడాలో తెలుసా?


Also Read: IPL 2023 Live streaming: ఐపీఎల్ 2023 లైవ్ స్ట్రీమింగ్ ఫ్రీ.. ఎక్కడ? ఎలా చూడాలో తెలుసా?



 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  TwitterFacebook