Adivi Sesh: తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన హీరో అడివి శేషు
Adivi Sesh: యువ నటుడు అడవి శేషు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. గత కొద్ది రోజుల క్రితం అడివి శేషుకు డెంగ్యూ సోకి...రక్తంలో ప్లేట్‌లెట్స్ కౌంట్ పడిపోయి.. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం.
Adivi Sesh: టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేషు ఆస్పత్రిలో చేరారు. తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయన హైదరాబాద్ లో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా గతవారం అడివి శేష్ డెంగ్యూ బారిన పడగా.. తాజాగా ఆయనకు రక్తంలో ప్లేట్‌లెట్స్ అకస్మాత్తుగా తగ్గిపోవడంతో సెప్టెంబర్ 18న ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యుల బృందం నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అడవి శేషు(Adivi Sesh) అనారోగ్యం గురించి తెలుసుకున్న అభిమానులు నటుడు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. మరోవైపు హీరో అరోగ్యంపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.
అయితే ఇప్పటివరకు ఈ యంగ్ హీరో ఆరోగ్య పరిస్థితిపై ఆయన కుటుంబసభ్యులు గానీ.. సన్నిహితులు కానీ స్పందించలేదు. త్వరలోనే ఆయన ఆరోగ్యంకు సంబంధించిన పూర్తి వివరాలను ఆయన కుటుంబసభ్యులు ప్రకటించనున్నట్లుగా సన్నిహితులు తెలిపారు. ఇక యంగ్ హీరో ఇలా అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరడంతో టాలీవుడ్(Tollywood) చిత్రపరిశ్రమ ఒక్కసారిగా షాకయ్యాంది. ఆయన తొందరగా కోలుకోవాలని అభిమానులు.. సన్నిహితులు కోరుకుంటున్నారు.
Also read: Bigg Boss 15: హాట్ టాఫిక్ గా సల్మాన్ రెమ్యూనరేషన్..బిగ్‌బాస్ 15 సీజన్ కోసం రూ.350 కోట్లా...!
ప్రస్తుతం చేస్తున్న సినిమాలు..
ప్రయోగాత్మక చిత్రాలకు పెద్ద పీట వేస్తూ...కంటెంట్ ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకుంటూ..చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు అడవిశేషు. కాగా హీరో అడవి శేషు ప్రస్తుతం “మేజర్”(Major Movie)సినిమాతో బిజీగా ఉన్నాడు. ‘ 26/11 ముంబై టెర్రర్ అటాక్ లో అమరుడైన ఆర్మీ ఆఫీసర్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. శశికిరణ్ తిక్క దర్శకత్వంలో మహేష్ బాబు బీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ ఏ ప్లస్ ఎస్ మూవీస్ సహకారంతో సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా ఈ మూవీని నిర్మిస్తోంది. ఈ సినిమాతో పాటు.. టాలీవుడ్ సూపర్ హిట్ మూవీ 'హిట్'(Hit) సిక్వెల్లోనూ అడివి శేషు నటిస్తున్నాడు. ప్రస్తుతం అడివి శేషు పూర్తిగా వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని.. ఆయన ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడేవరకు ఆసుపత్రిలో ఉండనున్నట్లుగా సమాచారం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook