Naa Saamiranga-Allari Naresh: టాలీవుడ్ మన్మథుడు నాగార్జున లేటెస్ట్ మూవీ 'నా సామిరంగ'(Naa Saamiranga). ఈ మూవీతో విజయ్ బన్నీ డైరెక్టర్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ సినిమాలో  కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్, గ్పింప్స్ మూవీపై భారీగా అంచనాలు పెంచేశాయి. ముఖ్యంగా ఎత్తుకెళ్లిపోవాలనిపిస్తుందే పిల్లా .. అనే ఫస్ట్ సాంగ్ సోషల్ మీడియాను ఓ ఊపు ఊపుస్తోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన మరో ఇంటెస్ట్రింగ్ అప్ డేట్ ను ఇచ్చారు మేకర్స్. ఈ చిత్రంలో హీరో అల్లరి నరేష్ ఓ కీ రోల్ చేయబోతున్నాడు. తాజాగా అతడి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసింది చిత్రబృందం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇందులో నరేష్ అంజి అనే పాత్రలో కనిపించబోన్నాడు. ఇతడికి సంబంధించిన ఇంట్రో గ్లింప్స్ రేపు అంటే డిసెంబరు 15, ఉదయం 10 గంటల 18 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ఎక్స్ వేదికగా మేకర్స్ ప్రకటించారు. 'మా అంజి గాడ్ని పరిచయం చేస్తున్నాం. లేదంటే మాటొచ్చేత్తది'..” అంటూ నరేష్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను అభిమానులతో పంచుకుంది మూవీటీమ్. ఇందులో గల్లా చెక్క.. లుంగీ.. కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని.. మెడలో పొట్లకాయలతో డాన్స్ చేస్తూ డిఫరెంట్ గా కనిపించాడు నరేష్. ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. నాగార్జున-కీరవాణి కలయికలో వచ్చిన ఎన్నో సినిమాలు మ్యూజికల్ సెన్షేషన్ గా నిలిచాయి. 



చిన్న క్యారెక్టర్, పెద్ద రోల్ అని చూడకుండా కథ నచ్చితే ఏ హీరోతో చేయడానికైనా రెడీగా ఉంటాడు అల్లరి నరేష్. గతంలో మహేష్ తో కలిసి మహార్షిలో సందడి చేశాడు. తాజాగా సీనియర్ నాగార్జునతో చేయడానికి పచ్చజెండా ఊపేశారు. వీరిద్దరూ కాంబో వెండితెరపై ఎలాంటి మ్యాజిక్ చేయబోతుందో తెలియాలంటే వచ్చే ఏడాది సంక్రాంతి వరకు ఆగాల్సిందే. ఈ చిత్రాన్ని నిర్మాత శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నారు. 


Also Read: BB 7 Telugu Finale Guest: బిగ్‍బాస్ గ్రాండ్ ఫినాలేకు చీఫ్ గెస్ట్ ఎవరో తెలుసా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి