Young Hero Becoming Close to a Instagram Influencer: సినీ పరిశ్రమలో ప్రేమలు, ప్రేమ పెళ్లిళ్లు చాలా కామన్. కానీ ఒక్కోసారి మాత్రం కొన్ని ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. తాజాగా ఒక యువ హీరో ఒక ఇంస్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్  వెంట పడుతున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా విరివిగా అందుబాటులోకి వచ్చిన తర్వాత టిక్ టాక్ ఆ తర్వాత యూట్యూబ్ షాట్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ పలువురు మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంటున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ నేపథ్యంలోనే సినిమా రిలీజ్ కి కొద్ది రోజుల ముందు వారిని కూడా సినిమా ప్రమోషన్స్ లో భాగం చేస్తూ వారి చేత కూడా సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. అలా తన సినిమాని ప్రమోట్ చేయడానికి వచ్చిన ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్  తో కుర్ర హీరో క్లోజ్ గా మూవ్ అవుతున్నట్టుగా ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఆమెను ఆనందపరిచేందుకుగాను కొన్ని బహుమతులు కూడా  పంపుతున్నాడని, ఎప్పటికప్పుడు సర్ప్రైజ్ గిఫ్ట్ ల పేరుతో కాస్ట్లీ బహుమతులు కూడా ఆమెకు పంపుతున్నాడని ప్రచారం జరుగుతోంది.


అయితే ఈ రహస్య స్నేహాన్ని రహస్యంగా ఉంచాలని ప్రయత్నించినా ఎలాగో ఆ నోట ఈ నోటా పడి టాలీవుడ్ వర్గాలకు తెలిసిపోయింది. దీంతో సదరు హీరో గురించి ఇప్పుడు రకరకాల చర్చలు టాలీవుడ్ వర్గాల్లో జరుగుతున్నాయి. అయితే సదరు హీరోని కలవడానికి ముందు కలిసిన తర్వాత అన్నట్టుగా ఆ ఇంస్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ లైఫ్ స్టైల్ కూడా భారీగా మార్పు చెందిందని, అంతకుముందు సాదాసీదా గానే కనిపించినా ఇప్పుడు మాత్రం హై ఫై లైఫ్ కి అలవాటు పడిపోయిందని ఆమెలో మోడరన్ యాంగిల్ బయటకు తీసిందని అంటున్నారు.


సాధారణంగా హీరోలు హీరోయిన్లతో స్నేహం పెంచుకోవడం జరుగుతూనే ఉంటుంది కానీ ఇలా సినీ గ్లామర్ ఏమీ లేని ఒక ఇంస్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ వెనుక ఈ కుర్ర హీరో ఎందుకు పడుతున్నాడా అని చర్చ ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో పెద్ద ఎత్తున జరుగుతోంది. అయితే ఈ ఇద్దరూ కేవలం స్నేహానికే పరిమితం అవుతారా? లేక ప్రేమ పేరుతో ముందుకు వెళతారా? ఒక వేళ ప్రేమ పేరుతో ముందుకు వెళ్లిన కేవలం టైం పాస్ చేసి ఎవరి జీవితాలు వారు చూసుకుంటారా ? లేక ఈ బంధాన్ని మరింత ముందుకు తీసుకువెళతారా? అనే అంశం మీద కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.


Also Read: Heroines Rare Medical Conditions: సమంత సహా అరుదైన వ్యాధులతో బాధ పడుతున్న హీరోయిన్లు వీరే!


Also Read: Posani Krishna Murali : విశ్వాసానికి అందలం.. ఏపీ ఫిలిం డెవలప్మెంట్ బోర్డు ఛైర్మన్ గా పోసాని నియామకం!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook