సాహో ప్రభాస్.. కరోనాపై పోరాటానికి రూ4 కోట్ల భారీ విరాళం
రాజకీయ, సినీ, వ్యాపారవేత్తలు ముందుకొస్తున్నారు. తమ వంతుగా విరాళాలు ప్రకటిస్తున్నారు. టాలీవుడ్ నుంచి అధిక విరాళం ప్రభాస్ ప్రకటించడం విశేషం.
కరోనా వైరస్ మహమ్మారిపై చేస్తున్న పోరాటంలో భాగంగా రాజకీయ, సినీ, వ్యాపారవేత్తలు ముందుకొస్తున్నారు. తమ వంతుగా విరాళాలు ప్రకటిస్తున్నారు. టాలీవుడ్ నుంచి తొలుత హీరో నితిన్ రూ.20 లక్షలు ప్రకటించడంతో పాటు చెక్కును సైతం అందజేశాడు. ఆపై జనసేన అధినేత పనన్ కల్యాణ్ కేంద్రానికి రూ.1కోటి, రాష్ట్ర ప్రభుత్వాలను రూ.50లక్షల చొప్పున మొత్తం రూ.2కోట్లు కరోనాపై పోరాటానికి తన వంతు సాయం ప్రకటించారు. తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఎవరూ ఊహించనంతగా భారీ విరాళం ప్రకటించాడు. రామ్ చరణ్ బర్త్ డే.. చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు
ప్రభాస్ తన వంతు సాయంగా ఏకంగా రూ.4కోట్ల విరాళం అందించారు. ఈ మేరకు పీఆర్‌వో బీఏ రాజు, ప్రభాస్ అధికారిక ట్విట్టర్‌లో ఈ వివరాలు వెల్లడించారు. ప్రధాన మంత్రి సహాయనిధికి రూ.3కోట్లు ప్రకటించారు. ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.50లక్షలు, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.50 లక్షలు అందజేయనున్నాడు ప్రభాస్. టాలీవుడ్ సినిమా రంగం నుంచి కరోనాపై పోరాటానికి ఇదే ఇప్పటివరకూ అధికమొత్తం కావడం విశేషం. ప్రభాస్ అభిమానులతో పాటు తెలుగు రాష్ట్రాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ సాహో ప్రభాస్ అని సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. కడుపుబ్బా నవ్వించే కరోనా మీమ్స్
కాగా, సూపర్ స్టార్ మహేష్ బాబు రూ.1కోటి, చిరంజీవి రూ.1కోటి, ఎన్టీఆర్ రూ.75 లక్షలు, రామ్ చరణ్ రూ.70లక్షలు, దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ రూ.20 లక్షలు, కొరటాల శివ రూ.10 లక్షలు, అనిల్ రావిపూడి రూ.10లక్షలు, వీవీ వినాయక్ రూ.5లక్షలు, మరికొందరు సినీ ప్రముఖులు కరోనాపై పోరాటానికి తమ వంతు ఆర్థిక సాయం ప్రకటించారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
బికినీలో సెగలురేపుతోన్న Sunny Leone