యూ ట్యూబ్ యూజర్లుకు గుడ్ న్యూస్..ఇందులో సరికొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఇప్పటి వరకు మనం వీడియోలు  వాచ్ చేయడం మాత్రమే చేశాం...అయితే ఆ వీడియోలు ఇతరులకు షేర్ చేయాలంటే  ఫేస్ బుక్, ట్విట్టర్, గూగుల్ ఫ్లస్ లాంటి సోషల్ మీడియాపై ఆధారపడుతున్నాం. ఇక నుంచి ఆ పరిస్థితి ఉండకపోవచ్చు. యుజర్ల అవసరాలు దృష్టిలో పెట్టుకొన్ని యూ ట్యూబ్ సంస్థ ఓ సరి కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఈ  ఫీచర్ ను అనుసరించి యూట్యూబ్ ద్వారా ఇతరులకు వీడియో షేర్ చేసుకునే వీలుంటుంది.


 ప్రయోగంలో భాగంగా ఈ ఫీచర్ ను కెనడా లో అమలు పరచగా..యూజర్లను నుంచి మంచి స్పందన వస్తోంది. దీంతో  ఇప్పుడు దీన్ని ప్రపంచ వ్యాప్తంగా అమలు చేయాలని ఆ సంస్థ ప్లాన్ రెడీ చేసింది. ఈ ఫీచర్ మనకు అందుబాటులో వచ్చినట్లయితే యూ ట్యూబ్ వీడియోలను నేరుగా మీ ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులకు యూట్యూబ్ యాప్ ద్వార షేర్ చేసుకోవచ్చు. అంతే కాదు ఈ  వీడియోపై కామెంట్స్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నారు. త్వరలో అందించే అప్ డేట్ ద్వారా ఆండ్రాయిడ్ ఐవోఎస్ వినియోగదారులకు ఈ సదుపాయం అందుబాటులోకి రానుందని యూట్యూబ్ సంస్థ  ప్రతినిధులు పేర్కొన్నారు. అయితే ఈ  ఫీచర్ ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి రావాలంటే మరికొన్ని రోజుల పాటు వేచి చూడాల్సిందేనంటున్నారు.