YouTuber Harsha Sai: పేదలకు డబ్బులు పంచుతూ ఆ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసి నెటిజన్లను ఆకట్టుకుంటున్న యూట్యూబర్‌ హర్షసాయి తనపై నమోదైన కేసు.. యువతి ఆరోపణలపై స్పందించారు. ఆరోపణలను ఖండించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ఆ యువతితో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇవన్నీ నిరాధార ఆరోపణలని కొట్టి పారేశాడు. త్వరలో నిజనిజాలు బయటకు వస్తాయని పేర్కొన్నాడు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Big Breaking: యూట్యూబర్‌ హర్షసాయి రూ.2 కోట్ల మోసం.. పెళ్లి పేరుతో నమ్మించి


 


తనను పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి.. ఇప్పుడు మొహం చాటేశాడని.. రూ.2 కోట్లు తీసుకున్నాడని హర్షసాయిపై బిగ్‌బాస్ ఫేమ్ మిత్ర శర్మ ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని నార్సింగి పోలీసులకు ఆమె ఫిర్యాదు చేయడంతో వివిధ సెక్షన్ల కింద కేసు కూడా నమోదైన విషయం తెలిసిందే. హర్షసాయి తండ్రి రాధాకృష్ణపై నార్సింగ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న హర్షసాయి సామాజిక మాధ్యమాల ద్వారా స్పందించాడు.

Also Read: Harsha Sai: హర్ష సాయి ఉదంతంలో షాకింగ్ నిజాలు.. నగ్నంగా ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్..!


 


రేప్‌ కేసుపై యూట్యూబర్‌ హర్షసాయి తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీ ద్వారా స్పందించాడు. 'డబ్బు కోసమే తప్పుడు ఆరోపణలు. నా గురించి మీకు తెలుసు. త్వరలోనే నిజానిజాలు బయటకు వస్తాయి'  అంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టాడు. 'నాపై వచ్చిన ఆరోపణలకు నా న్యాయవాది సమాధానం చెబుతారు' అని వెల్లడించాడు. కేసు విషయమై అతడి న్యాయవాది సంప్రదింపులు చేస్తున్నట్లు సమాచారం.


పరారీలో హర్షసాయి, తల్లిదండ్రులు?
కేసు నమోదైన వార్త తెలిసిన వెంటనే హర్షసాయితోపాటు అతడి కుటుంబసభ్యులు కూడా పరారైనట్లు సమాచారం. పరారీలో ఉన్న హర్షసాయి కోసం పోలీసుల గాలింపు చేపట్టారు. హర్షసాయి కుటుంబసభ్యులు కూడా అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలిసింది. హర్షసాయితో పాటు అతడి కుటుంబసభ్యులు ఫోన్లు స్విచ్చాఫ్ చేశారు. హర్షసాయి నుంచి ప్రాణహాని ఉందని బాధితురాలు వాపోతున్నారు. 


కాపీ రైట్స్‌ కోసమే?
బాధితురాలి ఫిర్యాదులో కీలక అంశాలు వెలుగుచూశాయి. ‘మెగా’ సినిమా కాపీ రైట్స్‌ కోసం హర్ష పట్టుబడుతున్నట్లు ఆమె ఆరోపించారు. సినిమాకు బాధితురాలు నిర్మాతగా ఉన్నారు. మత్తుమందు ఇచ్చి తనపై అఘాయిత్యానికి పాల్పడినట్టు కూడా ఫిర్యాదులో తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ  సమయంలో వీడియోలు తీసి.. కాపీరైట్స్‌ ఇవ్వకపోతే వీడియోలు వైరల్‌ చేస్తానని బెదిరిస్తున్నాడని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఉంది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.