Pamela Chopra Death : బాలీవుడ్లో విషాదం.. ఆదిత్య చోప్రా తల్లి కన్నుమూత
Aditya Chopra Mother Death బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ అయిన యశ్ రాజ్ చోప్రా అధినేతి ఆదిత్య చోప్రా తల్లి పమీలా చోప్రా నేడు కన్నుమూశారు. గురువారం తెల్లవారు ఝామున ఆమె కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా హాస్పిటల్ బెడ్డు మీద ప్రాణాలతో కొట్టుమిట్టాడిన ఆమె గురువారం తుది శ్వాస విడిచారు.
Pamela Chopra Passes Away బాలీవుడ్ ప్రముఖ నిర్మాత ఆదిత్య చోప్రా మాతృమూర్తి పమీలా చోప్రా (74) గురువారం ఉదయం కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా వెంటిలేటర్ మీద చికిత్స తీసుకుంటున్న ఆమె నేటి ఉదయం తుది శ్వాస విడిచారు. ఈ మేరకు యశ్ రాజ్ చోప్రా ద్వారా ఓ ప్రెస్ నోట్‌ను విడుదల చేశారు. ముంబైలో నేడు ఆమె అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నట్టుగా తెలిపారు.
శోకతప్త హృదయాలతో మీకు ఈ విషయాన్ని చెప్పాలని అనుకుంటున్నాం. ఈ రోజు ఉదయం పమీలా చోప్రా (74) కన్నుమూశారు. నేడు పదకొండు గంటలకు ముంబైలో ఆమె అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నాం. మీ ప్రేమకు మేం ఎప్పుడూ రుణపడి ఉంటాం.. కానీ ఇలాంటి సమయంలో మా ప్రైవసీని మీరు గౌరవిస్తారని, అర్థః చేసుకుంటారని భావిస్తున్నాం.. అని ఓ ప్రెస్ నోట్‌ను రిలీజ్ చేశారు.
ఆమె లీలావతి హాస్పిటల్‌తో గత పదిహేను రోజుల నుంచి వెంటిలేటర్ మీదే ఉన్న సంగతి తెలిసిందే. ఇక వైద్యులు చికిత్సకు ఏ మాత్రం రెస్పాండ్ కాని.. పమీలా నేటి ఉదయం తుది శ్వాస విడిచారు. ఆమె ప్రముఖ దర్శక నిర్మాత యశ్ రాజ్ చోప్రా సతీమణి. యశ్ రాజ్ చోప్రా బ్యానర్‌ను స్థాపించడం, అందులో నిర్మించిన సినిమాలకు బ్యాక్ గ్రౌండ్‌లో వర్క్ చేయడం అందరికీ తెలిసిందే. ప్రతీ సినిమాకు ఆమె ఇన్ పుట్స్ ఉండేవని యశ్ రాజ్ అప్పట్లోనే చెప్పేశాడు. కభీ కభీ అనే సినిమాకు ఆమె కథను అందించారు. తరువాత ఎన్నో సినిమాలకు డిజైనర్‌గా పని చేశారు.
Also Read: IT Raids on Mythri : మైత్రీ కార్యాలయంలో రెండో రోజూ ఐటీ దాడులు.. వందల కోట్లపై ఆరా
పమీలా మరణం పట్ల బాలీవుడ్ అంతా స్పందిస్తోంది. తీవ్ర సంతాపాన్ని ప్రకటిస్తోంది. సంజయ్ దత్, అక్షయ్ కుమార్, అజయ్ దేవగణ్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ ఇలా అందరూ కూడా పమీలా మరణం పట్ల స్పందిస్తూ ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.
Also Read: Mrunal Thakur : 'సీత'ను రొమాంటిక్‌గానే చూడాలనుకుంటున్నారా?.. నెటిజన్ల కోరిక ఇదే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook