Yatra 2 Release Date: ఆంధ్రప్రదేశ్ దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్‌రెడ్డి బయోపిక్‌ గా వచ్చి అప్పట్లో అందరినీ ఆకట్టుకున్న సినిమా యాత్ర. ఇందులో వై.ఎస్‌.రాజ‌శేఖ‌ర్ రెడ్డి పాత్ర‌లో మ‌ల‌యాళం సూప‌ర్ స్టార్ మ‌మ్ముట్టి నటించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర  ఆధారంగా ‘యాత్ర’ చిత్రాన్ని తెరకెక్కించారు. అత్యంత ప్ర‌జాద‌ర‌ణను పొందిన ఈ చిత్రంకు కొన‌సాగింపుగా ఇప్పుడు ‘యాత్ర 2’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మహి వి రాఘవ్ దర్శకత్వంలో త్రీ ఆట‌మ్ లీవ్స్‌, వీ సెల్యూలాయిడ్, శివ మేక సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం ‘యాత్ర 2’. ఇందులో వై.ఎస్‌.రాజ‌శేఖ‌ర్ రెడ్డి పాత్ర‌లో మ‌ల‌యాళం సూప‌ర్ స్టార్ మ‌మ్ముట్టి కనిపిస్తుండగా.. వై.ఎస్‌.జ‌గ‌న్‌ పాత్ర‌లో కోలీవుడ్ స్టార్ జీవా న‌టిస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 8న విడుదల కావటానికి సన్నాహాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ శుక్రవారం మేకర్స్ ‘యాత్ర 2’ టీజర్‌ను విడుదల చేశారు. 


టీజర్‌ విషయానికి వస్తే...వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి (మమ్ముట్టి) కొడుకుగా వై.ఎస్.జగన్ (జీవా) రాజకీయాల్లోకి రావటానికి కారణమేంటనే అంశాన్ని ఎమోషనల్ చూపించారు దర్శకుడు. అదే సందర్భంలో తండ్రిలాంటి నాయకుడిని కోల్పోయినప్పుడు వారిని ఓదార్చటానికి ఓదార్పు యాత్ర చేద్దామంటే నాటి రాజకీయ నాయకులు ఎలాంటి అడ్డంకులు సృష్టించారనే విషయాన్ని కూడా చూపించే ప్రయత్నం చేశారు డైరెక్టర్.  అయితే ఆ అడ్డంకులను రాజశేఖర్ రెడ్డి కుమారుడు జగన్ ఎలా అధిగమనించారు.. తిరుగులేని ప్రజా నాయకుడిగా ఎలా ఎదిగారనేదే ‘యాత్ర 2’ సినిమా కథగా తెలుస్తోంది. 


 



ఇందులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పాత్రలో సుజానె బెర్నెర్ట్, నారా చంద్రబాబు నాయుడు పాత్రలో బాలీవుడ్ నటుడు మహేష్ మంజ్రేకర్, వై.ఎస్.భారతి పాత్రలో కేతకి నారాయణన్ నటించారు. యాత్ర సినిమాను ఫిబ్ర‌వ‌రి 8, 2019లో విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. కాగా ‘యాత్ర 2’ ని కూడా అదే తేదీన ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రావాలని ప్రయత్నిస్తున్నారు ఈ చిత్ర నిర్మాతలు. అనగా 2024 ఫిబ్రవరి 8న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. 


Also read: Japan Earthquake Scary Videos: జపాన్‌లో భారీ భూకంపం, భయపెడుతున్న వీడియోలు


Also Read: Poco M6 5G Price: న్యూ ఇయర్‌ ప్రత్యేక డీల్..Poco M6 5G ఇప్పుడు కేవలం రూ.699కే..పూర్తి వివరాలు ఇవే!


 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook