Zee Telugu: జీ తెలుగు ఆదివారం హంగామా..! భోళా శంకర్, డ్రామా జూనియర్స్ సహా ఎవరు ఎక్స్ పెక్ట్ చేయని ఎంటర్టైన్మెంట్ తో ప్రేక్షకుల ముందుకు..
Zee Telugu Entertainments: జీ తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు నాన్ స్టాప్ వినోదం అందిస్తూ ప్రేక్షకులను రంజింప చేస్తోంది. ఈ ఆదివారం జీ తెలుగు మరిన్ని ఎంటర్ట్మెంట్స్ ప్రోగ్రామ్స్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Zee Telugu Entertainments: జీ తెలుగు ఎంటర్టైన్మెంట్ గత కొన్నేళ్లుగా తెలుగు ప్రేక్షకులను నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ తో అలరిస్తూనే ఉంది. ఈ ఆదివారం 15వ తేదిన థియేటర్స్ లో విడుదలై మెగాస్టార్ చిరంజీవి చిత్రం 'భోళా శంకర్' మూవీ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ఈ ఆదివారం జీ తెలుగులో మధ్యాహ్నం 2.30 గంటలకు టెలికాస్ట్ కానుంది. మెగాస్టార్ చిరంజీవి, తమన్నా, కీర్తి సురేష్ యాక్ట్ చేసారు. మరోవైపు చిన్న పిల్లల్లోని టాలెంట్ ను వెలికి తీస్తూ.. వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు చూపే సక్సెస్ఫుల్ రియాలిటీ షో డ్రామా జూనియర్స్ సీజన్ 7 గ్రాండ్ ఫినాలేకు చేరుకుంది. ఈ షోలో పిల్లలు వేసే స్కిట్స్, చిచ్చర పిడుగుల ప్రదర్శనతో చివరి కంటా ఆసక్తికరంగా సాగిన డ్రామా జూనియర్స్ సీజన్ 7 గ్రాండ్ ఫినాలే రెండు భాగాలుగా ప్రసారం కానుంది. ఈ షో ఆదివారం రాత్రి 9 గంటలకు జీ తెలుగులో ప్రసారం కానుంది.
జీ తెలుగు అందిస్తున్న ఆదివారం హంగామా.. మెగాస్టార్ చిత్రం భోళా శంకర్ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తో షురూ కానుంది. చెల్లి కోసం ఎంతకైనా తెగించే అన్న పాత్రలో చిరంజీవి నటన ఆద్యంతం ఆకట్టుకునే విధంగా ఉంటుంది. మరి టెలివిజన్ లో 'భోళా శంకర్' ఏ మేరకు ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి. ప్రతి ఆదివారం వినోదాన్ని కొనసాగిస్తూ జీ తెలుగు డ్రామా జూనియర్స్ సీజన్ 7 గ్రాండ్ ఫినాలే పార్ట్ 1 ను రాత్రి 9 గంటలకు ప్రసారం చేయనుంది. ఏడు సీజన్లతో ఏళ్ల తరబడి అందరి మనసులు గెలుచుకున్న పాపులర్ కిడ్స్ రియాలిటీ షో లాస్ట్ కు చేరుకుంది.
శ్రీరామ్ వెంకట్ యాంకర్ వ్యవహరించిన ఈ కార్యక్రమానికి ప్రీతి శర్మ, సౌందర్య మెంటర్లుగా వ్యవహరిస్తున్నారు. ఇక, ఈ సీజన్కి సినీ ప్రముఖులు పూర్ణ, బలగం వేణు, జయప్రద న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ గ్రాండ్ ఫినాలే పార్ట్ 1 ఎపిసోడ్ పై భారీ అంచనాలే ఉన్నాయి.
అంతేకాదు ఈ గ్రాండ్ ఫినాలేకి ముఖ్య అతిథిగా లవర్ బాయ్ తరుణ్ హాజరై విన్నర్స్ అనౌన్స్ చేయనున్నారు. ఫస్ట్ టైమ్ చిన్న తెరపై తరుణ్ ఎంట్రీతో ఈ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ మరింత ప్రత్యేకంగా నిలువనుంది. గ్రాండ్ ఫినాలేలో భాగంగా ప్రేక్షకులను కంట తడి పెట్టించే పలు స్కిట్స్ ఉండనున్నాయి. మరోవైపు గణేస్ చతుర్ధి పండగ.. పై ఫన్నీ స్కిట్స్, టైమ్ ట్రావెల్ ఎక్స్ పీరియన్స్ స్కిట్స్ ప్రేక్షకులను నవ్వించనున్నాయి. ఈ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ సెప్టెంబర్ 15న మొదటి భాగం, సెప్టెంబర్ 22న రాత్రి 9 గంటలకు రెండవ భాగం టెలికాస్ట్ కానుంది. జీ తెలుగు డ్రామా జూనియర్స్ సీజన్ 7 టైటిల్ ఎవరు గెలుచుకోబోతున్నారో తెలియాంటే ఈ ఆదివారం, వచ్చే ఆదివారం ఎపిసోడ్స్ మిస్ కాకుండా చూడాల్సిందే.
అంతేకాదు మీ అభిమాన సీరియల్స్ మేఘసందేశం, పడమటి సంధ్యరాగం స్పెషల్ ఎపిసోడ్ మహాసంగమం, సెప్టెంబర్ 14, 15 తేదీల్లో రాత్రి 7.30 గంటలకు ప్రసారం కానుంది. రెండు సీరియల్స్ కు చెందిన యాక్టర్స్.. వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా జరుపుకోనున్నారు. జీ తెలుగు అందిస్తున్న ఈ వారాంతం వినోదాన్ని మీరు మిస్ కాకుండా ఎంచక్కా ఆస్వాదించండి.
ఇదీ చదవండి: పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకోవడానికి కారణమేమిటంటే..!
ఇదీ చదవండి: పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజ్నెవా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలుసా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.