Janaki Ramayya Gari Manavaralu Serial: వేసవికాలం మధ్యాహ్నం పూట.. బయటకిపోకుండా ఇంట్లోనే టీవీ చూస్తూ గడిపేయాలని అనుకుంటూ ఉంటాం. మరి అలాంటప్పుడు ఒక మంచి ఫ్యామిలీ కథతో కూడిన సీరియల్ వస్తే ఇంకా అంతకన్నా భాగ్యం ఏముంటుంది చెప్పండి. అందుకే ఎల్లప్పుడూ ప్రేక్షకులను సరికొత్త సీరియల్స్ తో ఆకట్టుకోవడంలో ముందంజులో ఉండే జీ తెలుగు.. ఈ వేసవికాలం ప్రేక్షకుల కోసం ఒకసారి కొత్త సీరియల్ తీసుకొస్తుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జీ తెలుగులో సరికొత్త సీరియల్ జానకి రామయ్యగారి మనవరాలు మే 6 న ప్రారంభం. సోమవారం – శనివారం వరకు ఈ సీరియల్ ప్రతిరోజు మధ్యాహ్నం రెండు గంటల 30 నిమిషాలకు ప్రచారం కానుంది. ప్రేమ, బాధ్యతల నడుమ సాగే సరికొత్త ప్రేమ కథతో రూపొందుతున్న సీరియల్ జానకి రామయ్యగారి మనవరాలు. అనురాగం, ఆప్యాయతల నడుమ పెరిగి తన అభిరుచికి తగిన అమ్మాయి కోసం వెతికే అబ్బాయి, కుటుంబ బాధ్యతల్లో తలమునకలైన అమ్మాయి మధ్య సాగే అందమైన ప్రేమకథగా ఈ సీరియల్ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆకట్టుకోనుంది. 


ఈమధ్య విడుదలైన ట్రైలర్ ప్రకారం జానకి రామయ్యగారి మనవరాలు సీరియల్ కథ విషయానికి వస్తే..తరతరాల నుంచి వస్తున్న మిఠాయి వ్యాపారం చేస్తున్న ఉత్తమ్ (రాజీవ్) చుట్టూ తిరుగుతుంది. తీవ్రమైన కుటుంబ కలహాలు, బాధాకరమైన గతం కారణంగా ఉత్తమ్ నానమ్మ (ఫాతిమా బాబు), తల్లి, మేనత్త, అత్త తమ ఆశలన్నీ, కలలన్నీ ఉత్తమ్పై రుద్దుతారు. ఎంతో ఆప్యాయంగా పెంచిన ఆ నలుగురు మహిళలను తన తల్లులుగానే భావిస్తాడు ఉత్తమ్. అందరూ కలిసి ఉత్తమ్ను మంచి వ్యక్తిగా, నిజాయతీపరుడిగా పెంచుతారు. తమలాంటి విలువలున్న నిజాయతీగల కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిని తమ కోడలిగా చేసుకోవాలన్నది వారి కోరిక.   ఉత్తమ్ గుణవంతుడైన యువకుడిగా, ఏ అమ్మాయికైనా సరిపోయే ఆదర్శ కొడుకుగా ఎదుగుతాడు.  ఉత్తమ్ కి సరిపోయే అమ్మాయిని వెతకడం ప్రారంభిస్తారు అతని కుటుంబ సభ్యులు. కానీ ఉత్తమ్ కలలో ఓ పొడవాటి జుట్టు ఉన్న అమ్మాయి కనిపిస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి కోసం వెతుకుతాడు ఉత్తమ్. కష్టపడి పనిచేసే, మధ్యతరగతి బ్యాంకు ఉద్యోగి అయిన మైథిలి (సంగీత), అందరినీ ఆకట్టుకునే మాటలతో తన దారిని తాను చక్కదిద్దుకునే నైపుణ్యం కలిగి ఉంటుంది. పరిపూర్ణంగా ఉండాలనే విపరీతమైన ఒత్తిడి కారణంగా అణచివేతకు గురైన ఉత్తమ్, మైథిలితో ప్రేమలో పడతాడు. మైథిలి తన తల్లి వెతుకుతున్న చక్కని అమ్మాయి అయినప్పటికీ, ఆమె కుటుంబం వారి ప్రేమకు అడ్డంకిగా మారుతుంది. ఉత్తమ్ తన తల్లిని ఒప్పించడానికి ఏం చేస్తాడు? కుటుంబం కోసం ఉత్తమ్ తన ప్రేమను వదులుకుంటాడా? అనేది తెలియాలంటే జీ తెలుగులో మే 6 న ప్రారంభం కానున్న జానకి రామయ్యగారి మనవరాలు సీరియల్ తప్పకుండా చూడాల్సిందే!



ఈ సీరియల్లో రాజీవ్, సంగీత ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, ఫాతిమా బాబు, రాజశేఖర్, అర్చన, జాకీ, కల్యాణ్ ప్రసాద్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.


 


Also read: Mahindra XUV 3XO: కేవలం 7.49 లక్షలకే Mahindra XUV 3XO లాంచ్, మే 15 నుంచి బుకింగ్స్


 



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook