Zee Telugu RRR Ganesha: తెలుగు ప్రేక్షకులకు.. ఆహ్లాదాన్ని అందించడంలో ఎప్పుడూ ముందుంటుంది జీ తెలుగు. మరీ ముఖ్యంగా పండగ రోజుల్లో.. సరికొత్త కాన్సెప్ట్స్ తో.. ఎంటర్టైన్మెంట్ ప్రొవైడ్ చేసే ప్రోగ్రాములను.. నిర్వహిస్తూ ఉంటుంది. ఇప్పుడు మరోసారి వినాయక చవితి రోజు కూడా.. తెలుగు ప్రేక్షకులను అదరించడానికి సిద్ధం అయిపోయింది మన జీ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జీ తెలుగు అందిస్తున్న వినాయక చవితి స్పెషల్ ఈవెంట్ RRR గణేశా.. ఈ ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రచారం కానుంది. ఫిక్షన్, నాన్-ఫిక్షన్ షోలతో నిరంతం తెలుగు ప్రేక్షకులకు వినోదం పంచే ఛానల్ జీ తెలుగు. పండుగల వేళ రెట్టింపు వినోదంతో అలరించే జీ తెలుగు ఈ వినాయక చవితికి మరో సరికొత్త కార్యక్రమాన్ని అందించేందుకు సిద్ధమైంది. 


అలనాటి తారలు రాధ, రాధిక ముఖ్య అతిథులుగా సందడి చేసిన జీ తెలుగు మెగా సంబరం RRR గణేశా. మీ అభిమాన నటీనటులు, ముఖ్య అతిథుల సమక్షంలో అంగరంగవైభవంగా జరిగిన వినాయక చవితి వేడుక RRR గణేశా ఈ ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు, మీ జీ తెలుగులో ప్రచారం కానుంది. 


జీ తెలుగు నటీనటులు అందరూ కలిసి ఈ వినాయక చవితిని ప్రత్యేకంగా జరుపుకోనున్నారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ సీనియర్ హీరోయిన్స్ రాధ, రాధిక ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. రాధ, రాధిక గ్రాండ్ ఎంట్రీతో ప్రారంభమయ్యే ఈ వేడుక ఆద్యంతం మనసును హత్తుకునే ప్రదర్శనలు, కడుపుబ్బా నవ్వించే కామెడీ పంచులతో సరదాగా సాగింది. డైలాగ్ వార్తో మొదటైన రాధ, రాధికల జట్ల మధ్య పోటీ అంత్యాక్షరీతో మరింత సబంరంగా కొనసాగబోతోంది ఈ ప్రోగ్రాం. 


ఆటపాటలతో పాటు, ఆకట్టుకునే స్కిట్‌తో డ్రామా జూనియర్స్ పిల్లల ప్రదర్శన ప్రేక్షకులను అలరిస్తుంది. అంతేకాదు, జీ తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బ్రతుకు జట్కా బండి’ని ఈ వేదికపై మరోసారి ప్రేక్షకులకు అందించారు. ఈ కార్యక్రమంలో రాధ, రాధిక ఒక జంట మధ్య సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న అంశాలను ప్రతిబింబిస్తూ, జీ తెలుగు నారి శక్తిగా దీప్తి మన్నె మహిళలకు ఆత్మరక్షణ పాఠాలు నేర్పిస్తుంది.
అంతేకాదు జీ తెలుగు పాపులర్ సీరియల్స్ ‘పడమటి సంధ్యారాగం’, ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్ నటుల ప్రత్యేక ప్రదర్శనలు, మ్యూజికల్ ఛైర్స్ ఆట, జుగల్బంది డాన్స్‌తో ఈ కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహంగా జరిగింది. ఈ వినోదభరిత కార్యక్రమాన్ని ఈ ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు మీరూ తప్పకుండా చూడండి!


Also Read: Double ismart Movie: సైలెంట్‌గా ఓటీటీలో వచ్చేసిన రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్


Also Read: Fish Venkat: ఆర్ధిక ఇబ్బందులో నటుడు ఫిష్ వెంకట్.. సాయం అందించిన నిర్మాత చదలవాడ శ్రీనివాస రావు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter