Zero Buzz on Megastar Chiranjeevi God Father Movie: మెగాస్టార్ హీరోగా గాడ్ ఫాదర్ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన లూసిఫర్ అనే సినిమాకి ఇది తెలుగు రీమేక్ గా రూపొందుతుంది. మోహన్ రాజా డైరెక్షన్లో కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద ఎన్వి ప్రసాద్, సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ మీద ఆర్బీ చౌదరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. నయనతార, సల్మాన్ ఖాన్, సత్యదేవ్, సునీల్, పూరీ జగన్నాధ్ వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటించిన ఈ సినిమా అక్టోబర్ 5వ తేదీన దసరా సందర్భంగా విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా విడుదల చేశారు కానీ ఇప్పుడు ఈ సినిమా విడుదల మీద నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. ఎందుకంటే సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ అక్టోబర్ సెప్టెంబర్ 15వ తేదీ సాయంత్రం విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. కానీ ఆ సాంగ్ ఇప్పటివరకు విడుదల చేయలేదు. నిజానికి మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన చివరి చిత్రం ఆచార్య దారుణమైన డిజాస్టర్ ఫలితాన్ని అందుకుంది.


ఈ నేపథ్యంలో గాడ్ ఫాదర్ సినిమా మీద చాలా దృష్టి పెట్టి ఎక్కువ ప్రమోషన్స్ చేస్తారని అందరూ భావించారు. కానీ అక్టోబర్ 5వ తేదీ విడుదల కావాల్సిన ఈ సినిమాకు ఇప్పటివరకు సరైన ప్రమోషన్స్ ప్రారంభించక పోవడం గమనార్హం. సినిమాలో సల్మాన్ ఖాన్ కూడా నటిస్తున్నాడు కాబట్టి హిందీలో కూడా విడుదల చేస్తున్నామని టీం అధికారికంగా ప్రకటించింది. కానీ అసలు తెలుగులోనే ఇప్పటివరకు ప్రమోషన్స్ ఊసే లేదు హిందీలో ఇంకా ప్రమోషన్స్ చేయకపోవడంతో సినిమా విడుదలవుతుందా లేదా అనే విషయం మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.


నిజానికి సినిమా అక్టోబర్ 5వ తేదీన విడుదల అవ్వాలి, అంటే లెక్క ప్రకారం ఇప్పటికే ప్రమోషన్స్ ప్రారంభించాలి. ఆచార్య విషయంలో చాలా ముందే మేలుకొని చాలా ప్రచారం చేసినా సినిమా దారుణమైన డిజాస్టర్ ఫలితాన్ని అందుకుంది. అలాంటిది ఇప్పుడు సినిమా విడుదలకు దగ్గరవుతున్నా ఇంకా ప్రమోషన్స్ మీద దృష్టి పెట్టకపోవడం మీద పెద్ద ఎత్తున చర్చ  జరుగుతోందిట. ఇప్పటికయినా సినిమా నిర్మాణ సంస్థ మేలుకోక పోతే ఈ సినిమా రిజల్ట్ కూడా దారుణంగా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయని చెప్పక తప్పదు. 


Also Read: Kabzaa Teaser: ప్రతి ఫ్రేమూ కేజీఎఫ్ లానే.. ఇన్స్పిరేషనా ఇంకేమన్నానా!


Also Read: Sampoornesh Babu offer: గాజువాక కండక్టర్ కు సంపూ బంపర్ ఆఫర్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి