Adah Sharma Accident News: ఈ మధ్యకాలంలో వివాదాస్పద సినిమాలను ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సుదీప్తో సేన్ దర్శకత్వంలో తెరకెక్కిన ది కేరళ స్టోరీ సినిమా మంచి హిట్ గా నిలిచింది. అయితే ఈ సినిమా దర్శకుడు సుదీప్తో సేన్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన ఆదాశర్మ రోడ్డు ప్రమాదానికి గురి అయ్యారు అనే వార్త హైలైట్ గా మారింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముంబైలో ఒక ప్రైవేట్ కార్యక్రమానికి వెళుతుండగా వీరి కారు యాక్సిడెంట్ కి గురైందని ఈ ప్రమాదంలో సుదీప్తో సేన్ అదేవిధంగా ఆదాశర్మకు కూడా గాయాలయ్యాయి అని తెలుస్తోంది. వెంటనే వీరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు చెబుతున్నారు. ఈరోజు సాయంత్రం కరీంనగర్లో హిందూ ఏక్తాయాత్రకు కేరళ స్టోరీ టీం హాజరు కావాల్సి ఉండగా ఈ ప్రమాదం జరగడంతో తాము రాలేకపోతున్నామని యూత్ గాదరింగ్ ముందు నుంచి నడిపించలేక పోతున్నామని డైరెక్టర్ సుదీప్తో సేన్  తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా వెల్లడించారు.


Also Read: Ruhani Sharma Photos: వైట్ స్లీవ్ లెస్ టాప్లో సెగలు రేపుతున్న రుహానీ శర్మ..


ఆదాశర్మ, యోగితా భిహాని, సోనియా బలానీ, సిద్ధి ఇద్నానీ ప్రధాన పాత్రలలో నటించిన ది కేరళ స్టోరీని కేరళలో తప్పిపోయిన 32 వేల మంది యువతుల జీవిత కథలను ఆధారంగా చేసుకుని తెరకెక్కించినట్లు ముందు ప్రకటించారు. అయితే 32 వేలమంది అనే ఫిగర్ కరెక్ట్ గా ధ్రువీకరించలేకపోవడంతో ముగ్గురి జీవితాల్లో జరిగిన నిజ జీవిత ఘటనల ఆధారంగా చేసుకుని ఈ సినిమా తెరకెక్కించినట్లు ప్రకటించారు. ఇక ఈ సినిమా పెద్ద ఎత్తున కలెక్షన్లు రాబడుతూ ముందుకు దూసుకుపోతోంది.


అయితే బీజేపీ ఈ సినిమాని ప్రమోట్ చేస్తూ ఉంటే కాంగ్రెస్ సహా మిగతా పార్టీల వారు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే తమిళనాడు, వెస్ట్ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో ఈ సినిమాని నిషేధించిన అంశం కూడా హాట్ టాపిక్ అవుతుంది. కేరళను తప్పుగా చూపించారని చెబుతూ కేరళలోని చాలా ప్రాంతాల ప్రజలు సినిమాని స్వచ్ఛందంగా నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. కానీ కలెక్షన్స్ మాత్రం దూసుకుపోతున్నాయి. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన తెలుగు వర్షన్ కూడా రిలీజ్ అయింది.


Also Read: Chatrapathi Remake: దారుణంగా హిందీ ఛత్రపతి కలెక్షన్స్.. బొక్కబోర్లా పడ్డారుగా!



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook