4 డీఎక్స్ థియేటర్ ఈ పేరు ఎప్పుడైనా విన్నారా..! ఇది చాలా స్పెషల్ థియేటర్ అండీ బాబు. తెరపై సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులకు కూడా సినిమాలోని సంఘటనలకు తగిన విధంగా అనుభూతిని కలిగించే థియేటర్ ఇది. సినిమాలో వర్షం పడినా.. మంచు కురిసినా.. పూల సువాసన వెదజల్లినా.. చూసే వీక్షకులకు కూడా కొన్ని సాంకేతిక పద్ధతులతో ఆ ఫీలింగ్ కలిగించడం ఈ థియేటర్ స్పెషాలిటీ. భారతదేశంలో 4డీ థియేటర్లు ఎప్పటి నుండో ఉన్నప్పటికీ.. తొలిసారిగా ఫీచర్ ఫిల్మ్స్‌‌ను 4డీలో చూపించడం ఇటీవలే ప్రారంభమైంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అందుకు ఢిల్లీలోని పీవీఆర్ థియేటర్స్ వేదికలుగా మారాయి. నోయిడాలోని పీవీర్ లాజిక్స్‌తో పాటు గురుగ్రామ్‌లోని పీవీఆర్ ఎంజీఎఫ్‌లో ఈ మధ్యకాలంలో 4డీ సినిమాలు ప్రదర్శించడం ప్రారంభించారు. 4డీఎక్స్ టెక్నాలజీని తొలుత దక్షిణ కొరియా కంపెనీ 2009లో ప్రారంభించింది. 2010లో ఇదే టెక్నాలజీని ఉపయోగించి అవతార్, టైటానిక్ లాంటి చిత్రాలను ప్రదర్శించారు. 2011లో సినీపోలీస్ కంపెనీ ఈ ప్రాజెక్టులో రూ.25 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టింది.