7th Pay Commission DA Hike Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు రెండో డీఏ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది జవనరిలో 3 శాతం డీఏ పెంపు ప్రకటించిన కేంద్రం రెండో డీఏని ఇంకా ప్రకటించాల్సి ఉంది. నిజానికి గత జూలై లోనే దీనిపై ప్రకటన వస్తుందని భావించినప్పటికీ అలాంటిదేమీ జరగలేదు. ఈ నెలలోనైనా డీఏ పెంపు ఉంటుందా లేక మరికొద్ది నెలలు వేచి చూడాల్సిందేనా అనే విషయంలో స్పష్టత లేదు. ఒకవేళ డీఏ పెరిగితే ఎంతవరకు పెరిగే ఛాన్స్ ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏఐసీపీఐ ఇండెక్స్ ప్రకారం డీఏ ఎంత పెరిగే ఛాన్స్ :


కేంద్ర కార్మిక శాఖ పరిధిలోని లేబర్ బ్యూరో విడుదల చేసే 'ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైజ్ ఇండెక్స్ (ఏఐసీపీఐ)'పై డీఏ పెంపు ఆధారపడి ఉంటుంది. ఈ ఏడాది జనవరిలో ఏఐసీపీఐ ఇండెక్స్ 125.1 శాతంగా, ఫిబ్రవరిలో 125గా, మార్చిలో 126గా, ఏప్రిల్‌లో 127.7, మే నెలలో 129గా ఉంది. దేశంలో ద్రవ్యోల్బణం అంతకంతకూ పెరుగుతుండటంతో ఏఐసీపీఐ ఇండెక్స్‌లోనూ పెరుగుదల నమోదైంది. ఒకవేళ ఏఐసీపీఐ ఇండెక్స్ ఇప్పుడు కూడా అదే స్థాయిలో ఉంటే డీఏ పెంపు 4 శాతం వరకు ఉండవచ్చు.


ద్రవ్యోల్బణం తగ్గకపోతే 4 శాతం డీఏ పక్కా :


2022-23 ఆర్థిక సంవత్సరానికి దేశంలో 6.7 శాతం ద్రవ్యోల్బణాన్ని ఆర్‌బీఐ అంచనా వేసింది. రెండో త్రైమాసికంలో ఇది 7.1 శాతం, మూడో త్రైమాసికంలో 6.4 శాతం నాలుగో త్రైమాసికంలో 5.8 శాతం ఉండొచ్చునని అంచనా వేసింది. ఒకవేళ ద్రవ్యోల్బణం గనుక తగ్గకపోతే ఏఐసీపీఐ ఇండెక్స్‌లో పెద్దగా మార్పు ఉండకపోవచ్చు. అదే జరిగితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తప్పకుండా 4 శాతం వరకు డీఏ పెంపు ఉండొచ్చు. ఈ మేరకు 7వ వేతన సంఘం కేంద్రానికి సిఫారసు చేసే అవకాశం ఉంది.


38 శాతానికి పెరగనున్న డీఏ : 


ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 34 శాతం డీఏ పొందుతున్నారు. మరో 4 శాతం డీఏ పెరిగితే అది 38 శాతానికి చేరుతుంది. తద్వారా ఉద్యోగుల జీతభత్యాలు కూడా పెరుగుతాయి. కేంద్ర ప్రభుత్వం త్వరలోనే రెండో డీఏ పెంపుపై ప్రకటన చేస్తుందేమోనని ఉద్యోగులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. 


Also Read: Basara IIIT Live Updates: బాసర ట్రిపుల్ ఐటీలో గవర్నర్ తమిళి సై.. పోలీసుల ఆంక్షలపై సీరియస్


Also Read: Hero Nani Escaped from Accident: హీరో నానికి తృటిలో తప్పిన పెను ప్రమాదం.. బొగ్గు గనిలో ఊహించని విధంగా! 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook