జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు నిరాశే..!!
`కరోనా వైరస్` కారణంగా విధించిన లాక్ డౌన్ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు నిరాశ కలిగించింది. అదేంటీ.. కరోనా వైరస్ లాక్ డౌన్ కు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు ఏంటి సంబంధం అనుకుంటున్నారా..! ఇది పూర్తిగా చదవండి.
'కరోనా వైరస్' కారణంగా విధించిన లాక్ డౌన్ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు నిరాశ కలిగించింది. అదేంటీ.. కరోనా వైరస్ లాక్ డౌన్ కు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు ఏంటి సంబంధం అనుకుంటున్నారా..! ఇది పూర్తిగా చదవండి.
తెలుగు సినీ పరిశ్రమ నవతరం హీరోల్లో అగ్రతారగా వెలుగొందుతున్న జూనియర్ ఎన్టీఆర్.. పుట్టిన రోజు వేడుకలకు మరో రెండు రోజులే ఉంది. మే 20న ఆయన పుట్టిన రోజు జరుపుకోనున్నారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ .. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న RRR సినిమాలో నటిస్తున్నారు. ఐతే తారక్ పుట్టిన రోజు సందర్భంగా.. RRR చిత్రంలో NTRకు సంబంధించిన గ్లింప్స్ లేదా వీడియో రిలీజ్ చేస్తారనే ప్రచారం జరిగింది. ఐతే దీనిపై RRR మూవీ టీమ్ క్లారిటీ ఇచ్చింది.
కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా పనులన్నింటికీ బ్రేక్ పడింది. కాబట్టి.. జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే కానుకగా రిలీజ్ చేద్దామనుకున్న గ్లింప్స్ లేదా వీడియో పనులు పూర్తి కాలేదని ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు నిరాశ చెందవద్దని కోరింది.
ఏదో ఒకటి రిలీజ్ చేయడం ఇష్టం లేదని RRR మూవీ టీమ్ ట్విట్టర్ ద్వారా తెలిపింది. ఐతే అందరు అభిమానులకు ఆనందం కలిగించేలా అతి త్వరలోనే గ్లింప్స్ రిలీజ్ చేస్తామని వివరించింది.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..