కోయంబత్తూరులోని అనుభవి సుబ్రహ్మణ్యేశ్వరుని ఆలయంలోకి స్వయాన ఆ వినాయకుడే వచ్చాడని ప్రజలు నమ్ముతున్నారు. వివరాల్లోకి వెళితే ఈ సోమవారం నాడు అదే ఆలయంలో అర్థరాత్రి వేళ ఓ గజరాజు ఆలయంలోకి అడుగుపెట్టి.. ప్రాంగణమంతా కలియతిరగడం జరిగింది. సీసీటీవీల్లో ఈ సంఘటనను చూసిన గుడి యాజమాన్యం ఆశ్చర్యపోయింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అసలు ఆలయంలోకి ఏనుగు ఎలా వచ్చిందో తమకు అర్థం కాలేదని వారు అంటున్నారు. అదే ఏనుగు వంటగదిలోకి వెళ్ళి ఆహారం తినడం కూడా పలువురికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇదంతా దైవమహిమగా ఆ ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేయడంతో ఆ ఆలయాన్ని దర్శించడానికి భక్తులు కూడా తండోపతండాలుగా వస్తున్నారట. 


అయితే ఈ విషయాన్ని అభూత కల్పనగా కొట్టిపారేస్తు్న్నారు కొందరు నాస్తికులు. కోయంబత్తూరులో ఉన్న ఈ ఆలయం అడవులకు సమీపంగా ఉందని.. ఏ క్రూరజంతువైనా రాత్రివేళల్లో ప్రాంగణంలోకి అడుగుపెట్టే అవకాశం ఉందని.. ఆ మాత్రం దానికి దీనిని దైవమహిమగా భావించడం మూర్ఖత్వమని వారు అంటున్నారు. ఏదేమైనా గుడిలోకి అడుగుపెట్టిన ఏనుగు, ఆహారాన్ని భుజించి వెళ్లడంతో.. స్వయానా ఆ విఘ్నేశ్వరుడే ఏనుగు రూపంలో తన సోదరుడైన సుబ్రహ్మణ్యేశ్వరుని గుడి వచ్చాడని కొందరు భక్తులు వాదిస్తున్నారు.