బాలీవుడ్‌లో మిస్టర్ పర్ఫెక్ట్‌గా పేరున్న ఆమిర్ ఖాన్ టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిపై తనకున్న అభిమానాన్ని తనదైన స్టైల్లో చాటుకున్నారు. జపాన్ పర్యటనలో వున్న ఈ ఇద్దరూ అనుకోకుండా క్యోటో ఎయిర్ పోర్టు కలుసుకున్నారు. విమానాశ్రయంలో చిరంజీవి గారిని చూడగానే పరిగెత్తుకుంటూ వెళ్లి ఆయన్ని కలిశానని ఆమిర్ ఖాన్ ట్వీట్ చేశాడు. చిరంజీవితో దిగిన ఫొటోను ట్విటర్‌లో పోస్ట్ చేసిన ఆమిర్ ఖాన్.. చిరును కలవడం ఆనందంగా ఉందని పేర్కొన్నాడు. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ప్రాజెక్టు గురించి చర్చించామని ట్వీట్‌లో పేర్కొన్న ఆమిర్ ఖాన్.. ''మీరు(చిరు) ఎప్పుడూ మాకు స్ఫూర్తినిస్తూనే ఉంటారు సార్'' అని చిరుపై ప్రశంసలు గుప్పించాడు. 


సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తోన్న ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి సినిమా షూటింగ్ నుంచి కొంత గ్యాప్ తీసుకున్న చిరంజీవి క్యోటో పర్యటనకి వెళ్లిన సంగతి తెలిసిందే.