ప్రస్తుతం నటులు నిర్మాతలుగా మారుతున్నారు.. దర్శకులు నటులుగా అవతారం ఎత్తుతున్నారు.. కొరియోగ్రాఫర్లు తెరపైకి హీరోలుగా వస్తున్నారు.. ఇలాంటి తరుణంలో రామ్ అసుర్ సినిమాలో నటుడిగా మెప్పించిన అభినవ్ సర్దార్ నిర్మాతగా మారాడు. మిస్టేక్ అనే సినిమాను నిర్మించాడు. ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ భరత్ కొమ్మాలపాటి డైరెక్షన్ చేశాడు. ఈ మూవీ ఈ వారమే థియేటర్లోకి వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? కథ, కథనాలు ఏంటి? అన్నది ఓ సారి చూద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం చిన్న సినిమాలకు ఆదరణ లభిస్తోంది. కంటెంట్, కాన్పెప్ట్ ఉంటే చిన్న సినిమానా? పెద్ద సినిమానా? అని ఆడియెన్స్ పట్టించుకోవడం లేదు. ఇప్పుడు చిన్న చిత్రాల హవా నడుస్తోంది. ఇలాంటి టైంలో 'రామ్ అసుర్‌' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న  అభిన‌వ్ స‌ర్దార్ నిర్మాతగా మారి మిస్టేక్ అనే సినిమాను తీశాడు. ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ భరత్ కొమ్మాలపాటి ఈ సినిమాను తెరక్కించాడు. ఈ చిత్రంలో బిగ్ బాస్ అజయ్ మెయిన్ పాత్రలో కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ థియేటర్లోకి వచ్చింది. మిస్టేక్ కథాకమామీషు ఏంటో ఓ సారి చూద్దాం. 


కథ
మిస్టేక్ సినిమాలో మూడు జంటలుంటాయి. అగస్త్య (బిగ్ బాస్ అజయ్, కార్తీక్ (తేజ ఐనంపూడి), దేవ్ (సుజిత్ కుమార్) ముగ్గురు ప్రాణ స్నేహితులు. బస్తీలో ఒకే రూంలో ఉంటారు. మిత్ర (ప్రియ), స్వీటీ (తానియ కల్ల్రా), పారు (నయన్ సారిక)లు ఆ ముగ్గురితో ప్రేమలో పడతారు. వీరికి ఆపై కొన్ని సమస్యలు వచ్చి పడతాయి. వాటి నుంచి తప్పించుకునేందుకు కొన్ని రోజుల పాటు దూరంగా ఉండాలని పారిపోతారు. ఆక్రమంలో ఓ అపరిచిత వ్యక్తి (అభినవ్ సర్దార్) వల్ల వారికి సమస్యలు వస్తాయి? అసలు ఆ వ్యక్తికి ఈ మూడు జంటలకు ఉన్న కామన్ లింక్ ఏంటి? వారి వెంట ఆ వ్యక్తి ఎందుకు పడతాడు? ఈ కథలో రాజా రవీంద్ర, సమీర్ పాత్రలు ఎంత వరకు ఉంటాయి? అనేది కథ.


నటీనటులు
అగస్త్యగా బిగ్ బాస్ అజయ్, కార్తీక్‌గా తేజ ఐనంపూడి, దేవ్ కారెక్టర్లో పూజారిలా సుజిత్ కుమార్ ముగ్గురూ అద్భుతంగా నటిస్తారు. కామెడీతో నవ్విస్తారు. యాక్షన్ సీక్వెన్సులోనూ ఓకే అనిపిస్తారు. ఇక ముగ్గురు గ్లామర్ డాల్స్‌తో తెర అంతా అందంగానే అనిపిస్తుంది. ప్రియ, తానియ, నయన్ ముగ్గురూ అందంగా కనిపించడమే కాదు.. చక్కగా నటించారు. ఇక విలన్‌గా అభినవ్ సర్దార్ అందరినీ ఆకట్టుకుంటాడు. ఆయన ఆహార్యం కొన్ని చోట్ల నవ్విస్తుంటుంది. నవ్విస్తూ, భయపెట్టే సీన్లతో అభినవ్ అదరగొట్టేస్తాడు. యాక్షన్ సీక్వెన్స్‌లో అభినవ్ సూపర్బ్ అనిపిస్తాడు. రాజా రవీంద్ర, సమీర్‌లకు మంచి పాత్రలు దొరికాయి.


Also Read: Amazon Freedom Sale 2023: అమెజాన్ లో డిస్కౌంట్ల జాతర.. ఈ స్మార్ట్ ఫోన్ లపై ఏకంగా రూ.12,000 తగ్గింపు!


విశ్లేషణ
కామెడీని, సస్పెన్స్, థ్రిల్స్‌ని అన్నీ కలిపి ఈ స్క్రిప్ట్‌ను డైరెక్టర్ రాసుకున్నాడు. ఓ స్లమ్ ఏరియా, ఓ రిచ్ ఏరియా, ఓ ఫారెస్ట్ సీక్వెన్స్ ఇలా కథను సరిగ్గా రాసుకున్నాడు దర్శకుడు. నవ్వించేందుకు స్లమ్ ఏరియాను వాడుకున్నాడు. అక్కడ బ్యాచ్ లర్ లైఫులు, బతుకులు ఎలా ఉంటాయో చూపించాడు. అడవిలో అందమైన విజువల్స్‌తో పాటుగా అదిరిపోయే యాక్షన్ సీక్వెన్సులను ప్లాన్ చేసుకున్నాడు. ఇలా ప్రేక్షకుడికి ఏం కావాలో అది ఇవ్వడానికి డైరెక్టర్ చేసిన ప్రయత్నం మెప్పిస్తుంది. ఈ ప్రాసెస్‌లో దర్శకుడు సక్సెస్ అయ్యాడని కూడా చెప్పొచ్చు.


ఫస్ట్ హాఫ్ అంతా కూడా అలా జాలీగా సాగినట్టు అనిపిస్తుంది. లవ్ స్టోరీ, కామెడీలు, పాటలతో స్పీడు బ్రేకర్లంటూ లేకుండా వెళ్తుంది. ఇక అటాక్ జరుగుతున్నప్పటి నుంచి కథనంలో వేగం పుంజుకుంటుంది. ఇంటర్వెల్ టైం వరకు అదిరిపోయే ట్విస్ట్ వస్తుంది. ఆ తరువాత ద్వితీయార్థం పరుగులు పెట్టినట్టుగా అనిపిస్తుంది. అడవిలో వింత మనుషులతో చేసే యాక్షన్ సీక్వెన్స్, ఆ ఘటం కూడా బాగుంటుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు వచ్చే ట్విస్టులు అందరినీ ఆకట్టుకుంటాయి. చివరకు సీక్వెల్ గురించి హింట్ ఇచ్చి వదిలేస్తారు.


టెక్నికల్‌గా ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది. పాటలు పర్వాలేదనిపిస్తాయి. మాటలు ఓకే అనిపిస్తాయి. ఆర్ఆర్ సీన్లను ఎలివేట్ చేస్తుంది. కెమెరావర్క్ వల్ల ఫారెస్ట్ విజువల్స్ అద్భుతంగా అనిపిస్తుంది. ఎడిటర్ బాగానే కట్ చేశాడు. నిర్మాత అభినవ్ తెరపైనా, తెర వెనుక చాలానే కష్టపడ్డట్టు కనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. 


రేటింగ్ 2.75


Also Read: Most Highest Selling Car: ఇండియాలో ఇప్పటివరకు ఎక్కువగా అమ్ముడైన కారు ఇదే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook