బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్  కథానాయకుడుగా తెరకెక్కుతున్న తాజా చిత్రం 'బిగ్ బుల్'. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను అభిషేక్ బచ్చన్ అభిమానులతో పంచుకున్నారు.  ఫస్ట్ లుక్ ను ట్విట్టర్, ఇన్స్ట్రాగ్రామ్ లో పోస్ట్ చేశారు. "The Big Bull! The man who sold dreams to India," అనే క్యాప్షన్ తో ఫస్ట్ లుక్ ను అభిషేక్ షేర్ చేశారు. అభిషేక్ బచ్చన్ ఆ పోస్టర్ లో కాస్త భిన్నంగా  కనిపిస్తున్నారు. 1990, 2000 సంవత్సరాల మధ్య భారత స్టాక్ మార్కెట్ ను ఊపేసిన స్టాక్ బ్రోకర్ హర్షద్ మెహతా జీవిత కథ ఆధారంగా చిత్రం రూపొందుతోంది.  ఈ సినిమా ద్వారా 1990-2000 మధ్య భారత ఆర్ధిక వ్యవస్థలో జరిగిన నిజమైన సంఘటనలను చూపిస్తున్నామని అభిషేక్ బచ్చన్ చెప్పారు.  


ఈ సినిమాలో అభిషేక్ బచ్చన్ సరసన ఇలియానా నటిస్తోంది.   హర్షద్  మెహతా బయోగ్రాఫికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్, ఆనంద్ పండిట్ నిర్మిస్తున్నారు. ఫస్ట్ లుక్ లోనే ఆకట్టుకునే విధంగా ఉందని పలువురు నెటిజనులు కామెంట్ చేశారు.