ఈ కథ మన చుట్టూ ఉన్న ఒక చీకటి నిజం గురించి..
భారతదేశంలో ప్రస్తుతం ఆడపిల్లలపై రోజురోజుకీ అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి.
భారతదేశంలో ప్రస్తుతం ఆడపిల్లలపై రోజురోజుకీ అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. 'ఎక్కడ చూసిన ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయింది' అనే మాట వినిపిస్తోంది. ఏటా దేశంలో ప్రతి ఎనిమిది నిమిషాలకు ఓ ఆడపిల్ల అపహరణకు గురవుతోంది. వారంతా ఏమైపోతున్నారు? వారికి ఏం జరుగుతోంది? వంటి విషయాలను ‘అమోలి వెలకట్టలేనిది’ అనే లఘుచిత్రంలో కళ్లకు కట్టినట్లు చూపించారు.
ఈ లఘుచిత్రానికి తెలుగులో నేచురల్ స్టార్ నాని వాయిస్ ఓవర్ ఇచ్చారు. ‘నన్ను కూరగాయల్ని అమ్మినట్లు అమ్మేశారు. మా పిన్ని నన్ను ఓ బ్రోకర్‌కు అమ్మేసింది’ అంటూ ఆడపిల్లలు తమ బాధల్ని చెప్పుకుంటూ బాధపడుతున్న దృశ్యాలను చూస్తే హృదయం ద్రవించక మానదు. 28 నిమిషాల నిడివి ఉన్న ఈ లఘుచిత్రానికి హిందీలో రాజ్‌కుమార్ రావ్, ఇంగ్లీష్ లో విద్యా బాలన్, తమిళంలో కమల్ హాసన్ వాయిస్ ఓవర్ ఇచ్చారు.