Nithiin: ప్రభాస్ బాటలో నితిన్.. దర్శకుడికి నితిన్ ఖరీదైన గిఫ్ట్
![Nithiin: ప్రభాస్ బాటలో నితిన్.. దర్శకుడికి నితిన్ ఖరీదైన గిఫ్ట్ Nithiin: ప్రభాస్ బాటలో నితిన్.. దర్శకుడికి నితిన్ ఖరీదైన గిఫ్ట్](https://telugu.cdn.zeenews.com/telugu/sites/default/files/styles/zm_500x286/public/2020/09/09/192751-nithingiftscartovenkykudumula.jpg?itok=nY0Z3K4N)
రెబల్ స్టార్ ప్రభాస్ బాటలోనే మరో యంగ్ హీరో నితిన్ నడుస్తున్నాడు. హీరో నితిన్ తన దర్శకుడు వెంకీ కుడుములకు మంచి గిఫ్ట్ ఇచ్చాడు. మంగళవారం నాడు వెంకీ కుడుముల పుట్టినరోజు సందర్భంగా బర్త్ డే గిఫ్ట్ (Nithiin Gifts Range Rover To Venky Kudumula) ఇచ్చి సర్‌ప్రైజ్ చేశాడు
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాటలోనే మరో యంగ్ హీరో నితిన్ నడుస్తున్నాడు. ఇటీవల తన ఫిట్‌నెస్ ట్రైనర్‌కు డార్లింగ్ ప్రభాస్ ఓ ఖరీదైన రేంజ్ రేవర్ కారును గిఫ్ట్‌గా ఇవ్వడం తెలిసిందే. తాజాగా హీరో నితిన్ సైతం తన దర్శకుడు వెంకీ కుడుములకు మంచి గిఫ్ట్ ఇచ్చాడు. మంగళవారం నాడు దర్శకుడు వెంకీ కుడుముల పుట్టినరోజు సందర్భంగా రేంజ్ రోవర్‌ను బర్త్ డే గిఫ్ట్ ఇచ్చి సర్‌ప్రైజ్ చేశాడు నితిన్. AstraZeneca Vaccine: ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ ట్రయల్స్ తాత్కాలికంగా నిలిపివేత
కొన్నేళ్లుగా హిట్ లేక తంటాలుపడుతున్న నితిన్‌కు భీష్మ సినిమాతో మళ్లీ సక్సెస్ తీసుకొచ్చిన దర్శకుడు వెంకీ కుడుములకు ఈ విధంగా బర్త్ గిఫ్ట్ ఇచ్చాడు హీరో నితిన్. ఈ ఏడాది వచ్చిన భీష్మ సినిమా నితిన్‌కు మళ్లీ సక్సెస్ బాట చూపింది. అందులోనూ నితిన్ పెళ్లికి ముందు సంతోషంతో పాటు సక్సెస్‌ను అందించిన మూవీ భీష్మ కావడం గమనార్హం. హీరో నితిన్ ఇచ్చిన బర్త్ డే గిఫ్ట్‌పై వెంకీ కుడుముల స్పందించాడు. Rhea Chakraborty Arrest: అది ఆమె కర్మ.. అంకితా లోఖాండే పోస్ట్!
‘మంచి వ్యక్తులతో బెస్ట్ సినిమా తీస్తే అంతా మంచే జరుగుతుంది. నా పుట్టినరోజు సందర్భంగా ఇంత మంచి బర్త్ డే గిఫ్ట్ ఇచ్చినందుకు నితిన్ అన్నకు థ్యాంక్యూ’ అని భీష్మ డైరెక్టర్ వెంకీ కుడుముల పోస్ట్ చేశాడు. ఛలో సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన డైరెక్టర్ వెంకీ కుడుముల రెండో సినిమా భీష్మ తీసి సక్సెస్ సాధించాడు. Gold Price: మార్కెట్‌లో నేటి బంగారం, వెండి ధరలు
ఫొటో గ్యాలరీలు
- Bigg Boss 4: అరియానా గ్లోరి ఫొటోలు
- Ananya Pandey Photos: అందాల భామ అనన్య గ్లామరస్ ఫొటోస్
- Anasuya Hot Photos: యాంకర్ అనసూయ లేటెస్ట్ ఫొటోలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYeR