Rhea Chakraborty Abhout Sushant Singh Rajput | బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య(Sushant Singh Rajput) కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. గురువారం వరకు 9 మందిని విచారించిన ముంబై పోలీసులు, శుక్రవారం మరో నలుగురిని విచారించారు. ఇందులో సుశాంత్ గాళ్‌ఫ్రెండ్‌గా బాలీవుడ్ సర్కిల్‌లో సుపరిచితురాలైన నటి రియా చక్రవర్తి(Rhea Chakraborty)ని పోలీసులు విచారించగా షాకింగ్ విషయాలు వెల్లడించింది.  బండ్ల గణేష్‌కు కరోనా పాజిటివ్.. టాలీవుడ్‌లో ఆందోళన!


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

యశ్ రాజ్ ఫిల్మ్స్‌తో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తన డీల్స్‌ను రద్దు చేసుకున్నాడని రియా చక్రవర్తి తెలిపింది. ఇకపై ఆ బ్యానర్‌లో తాను సినిమాలు చేయనని, నువ్వు కూడా ఆ బ్యానర్‌లో సినిమాలు చేయవద్దని సుశాంత్ తరచుగా తనకు చెప్పేవాడంటూ చనిపోయిన నటుడిపై సంచలన ఆరోపణలు చేసింది. యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌లో సుశాంత్ 2 సినిమాలు శుద్ధ్ దేశీ రొమాన్స్, ‘డిటెక్టివ్ బైఓంకేశ్ భక్షి’ చేశాడు. అయితే పాని అనే మరో సినిమాకు సుశాంత్‌కు అవకాశం ఇచ్చి కాంట్రాక్ట్ రద్దు చేసుకున్నట్లు విచారణలో తేలింది. కాబోయే భర్తతో నిహారిక ఫొటోలు వైరల్


తనను దాదాపు 9 గంటలపాటు పోలీసులు సుదీర్ఘంగా విచారించారని నటి రియా చక్రవర్తి తెలిపింది. సినిమాలతో పాటు ప్రొఫెషనల్, పర్సనల్ లైఫ్ గురించి, అన్ని కోణాల్లోనూ ప్రశ్నించారని వెల్లడించింది. యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌తో సుశాంత్ కాంట్రాక్ట్ రద్దు చేసుకున్నాడని, అదే విధంగా తనను సైతం ఆ బ్యానర్‌లో సినిమాలు చేయవద్దని సూచించాడని తన వాంగ్మూలంలో రియా చక్రవర్తి ప్రస్తావించింది. అయితే ఇది తాజాగా జరిగిన విషయం కాదని విచారణలో తెలిపింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 
మిస్ దివా విన్నర్, నటి ఫొటో గ్యాలరీ