Pawan Kalyan Unstoppable: పవన్ ఎపిసోడ్ కోసం స్పెషల్ టీములు.. దిల్ రాజును వాడుకుంటూ ఆహా ప్రమోషన్స్!
Aha Video Deployed Special Teams: పవన్ కళ్యాణ్ స్పెషల్ ఎపిసోడ్ ఆహాలో నేడు రిలీజ్ కాబోతున్న క్రమంలో స్పెషల్ టీములను మొహరించినట్టు తెలుస్తోంది. ఆ వివరాలు
Aha Video Deployed Special Teams for Pawan Episode: ఆహా వీడియో యాప్ లో ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె మంచి హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. 2021లో ఈ కార్యక్రమానికి సంబంధించిన మొదటి సీజన్ విజయవంతంగా పూర్తి కాగా 2022లో రెండో సీజన్ ప్లాన్ చేశారు ఇక 2022లో ప్లాన్ చేసిన రెండవ సీజన్ కి సంబంధించిన చివరి రెండు భాగాలు పవన్ కళ్యాణ్ తో ఉండబోతున్నాయి.
వాస్తవానికి ఈ ఎపిసోడ్లను సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేయాలని అనుకున్నారు కానీ అప్పటికే హోస్ట్ గా వ్యవహరిస్తున్న బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమా రిలీజ్ ఉండటంతో పవన్ కళ్యాణ్ ఎపిసోడ్స్ రిలీజ్ చేయలేదు. ఇక అందుకే ఫిబ్రవరి మూడో తేదీన పవన్ కళ్యాణ్ ఎపిసోడ్స్ లో మొదటి భాగాన్ని రిలీజ్ చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. అయితే పవన్ అభిమానుల కోరిక మేరకు ఒకరోజు ముందుగానే విడుదల చేసేందుకు ఆహా టీం నిర్ణయించుకుంది.
అయితే గతంలో ఇలాగే ప్రభాస్ ఎపిసోడ్ విషయంలో అభిమానులు అందరూ ఒక్కసారిగా ఆహా వీడియో యాప్ చూసేందుకు ఓపెన్ చేయడంతో ఈసారి ఆహా టీం సపరేట్ బ్యాక్ అప్ టీమ్ సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. గతంలో సర్వర్ క్రష్ అయిన నేపథ్యంలో ఈసారి ఎంతమంది వచ్చినా తట్టుకునే విధంగా అదనపు సర్వర్లను కూడా మోహరించినట్లు చెబుతున్నారు.
ఈ విషయాన్ని ఒక పవన్ కళ్యాణ్ అభిమాని షేర్ చేయగా దానికి దిల్ రాజు ఇటీవల ట్రోల్ అవుతున్న వారిసు ప్రీ రిలీజ్ ఫంక్షన్ మీమ్ వాడారు. దీనికి ఆహా వీడియో టీం స్పందిస్తూ ఫన్ వేణుమా ఫన్ ఇరుక్కు, మూమెంట్స్ వేణుమా మూమెంట్స్ ఇరుక్కు, ట్రూత్ ఫ్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వేణుమా అది కూడా ఇరుక్కు అంటూ ట్వీట్ చేశారు. అంతే కాదు ఈ ఎపిసోడ్ గురించి ఒక రేంజ్ లో ప్రమోషన్స్ చేస్తోంది ఆహా టీమ్.
Also Read: Director Sagar Died: టాలీవుడ్లో మరో విషాదం.. అనేక మంది డైరెక్టర్లను అందించిన సాగర్ మృతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.